నానాటికీ సమాజంలో ఆటవిక చర్యలు పెచ్చుమీరిపోతున్నాయి. అందుకు సాక్షమే.. ఈ ఉదంతం. అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దారుణమైన తీర్పిచ్చారు. ఆ తీర్పుపై యువకుడు పోలీసులను ఆశ్రయించారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి చట్టాల్ని ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షిస్తున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ఆటవిక చర్యలు ఇంకా.. కొనసాగుతున్నాయి. వివరాల ఇలా వున్నాయి..  

 

ఝాన్సీ జిల్లా ప్రేమనగర్ లోని గౌల్ టోలీ కి చెందిన భూపేష్ యాదవ్, ఆష్టాజైన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ ను గ్రామపెద్దలు వ్యతిరేకిస్తూ, వారిని బహిష్కరించారు. దీంతో ఆ దంపతులు గ్రామం విడిచి మరోప్రాంతంలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన పలువురు వరుడు కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో తనకుంటుంబానికి న్యాయం చేయాలంటూ వరుడు ఊరి గ్రామపెద్దల్ని ఆశ్రయించాడు. వరుడు భూపేష్ వ్యవహారంలో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు.  

 

గ్రామపెద్దలు అందరి సమక్షంలో.. లవ్ మ్యారేజ్ ను అంగీకరించాలంటే, వధువు గోమూత్రం తాగి, ఆవుపేడ తినాలని తీర్పిచ్చారు. అయితే ఆ తీర్పును మార్చాలని భూపేష్ తండ్రి సైతం గ్రామపెద్దల్ని కోరాడు. అందుకు గ్రామపెద్దలు  ఒప్పుకోకపోవడంతో బాధితుడు జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించాడు. ఈ సంఘటనపై దర్యాప్తు జరపాలని మేజిస్ట్రేట్, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) డాక్టర్ ప్రదీప్ కుమార్ ను ఆదేశించారు. 

 

దీంతో గ్రామపంచాయితీ పెద్దలపై, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతులకు భద్రత కల్పించారు. ఎస్ ఎస్ పీ విచారణలో భాగంగా గ్వాల్ వర్గానికి చెందిన ప్రజలు బహిష్కరణ ఎత్తివేయాలంటే వధువు గోమూత్రం, ఆవుపేడ తినాలని ఆదేశించినట్లు తేలింది. గ్రామపెద్దల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్ఎస్ పీ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తరాలు మారుతున్నా.. ఇలాంటి అమానుష సంఘటనలు పెచ్చుమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు వీటిపైన కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప, వాటికి అడ్డుకట్ట వేయలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి: