పై ఫోటోలో ఉన్న తల్లి కొడుకు వివాహం చేసుకున్నారని గత కొన్ని రోజులుగా ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన ఒక ముస్లిం యువతి తన భర్త చనిపోయిన తరువాత.. తన సొంత కొడుకుని పెళ్లి చేసుకుందని ఒక ట్విట్టర్ వినియోగదారుడు వీళ్లిద్దరి ఫోటోలను అప్లోడ్ చేసి తన ఖాతా ద్వారా చెప్పాడు. దీంతో అతడి ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. చాలామంది నెటిజనులు ఈ ఫోటోలను విపరీతంగా వాట్సాప్, ఫేసుబుక్ ఇలాంటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ కథలో ఎంత నిజముందో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


మహమ్మద్ జుబేర్ అనే ఒక ముస్లిం వ్యక్తి ఈ ఫోటో గురించి ఒక చిన్నపాటి రీసెర్చి చేసి ఇదంతా ఒక అసహ్యమైన కట్టుకథ అని తేల్చిచెప్పేశాడు. తాను ఈ ఫోటోని రివర్ సెర్చ్ చేసినప్పుడు... గూగుల్ ఫలితాలలో జనవరి 31వ తేదీన ఫేసుబుక్ లో ఈ ఫోటో పోస్ట్ చేయబడింది అని తెలిసింది. ఆ పోస్టుకు ఉర్దూ భాషలో ఒక క్యాప్షన్ జత చెయ్యబడింది. ఆ క్యాప్షన్ ని అనువాదం చేయగా.. 'ఇవాళ నా కుమారుడు ఖురాన్ పఠనం పూర్తి చేశాడు', అని వచ్చింది.


దీంతో అతడు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియపరిచాడు. పవిత్రమైన తల్లి కొడుకుకి వివాహం అయ్యిందని తప్పుడుగా ప్రచారం చేస్తున్న వారికి కొంతైనా సిగ్గు ఉండాలని అతడి చురకలు అంటించాడు. తర్వాత మిగిలిన నెటిజనులు కూడా పెళ్లి గురించి తప్పుడు రాతలు రాసిన వ్యక్తిని తిట్టిపోశారు. ఏదేమైనా ఇటువంటి తప్పుడు రాతలు రాయడం వలన ఒరిగేది ఏమీ లేదు. కానీ ముస్లిం మహిళల గురించి ఇటువంటి దుష్ప్రచారం ఎందుకు చేయాలనుకున్నాడో ఇది నెట్టులో పోస్ట్ చేసిన ఆ వ్యక్తి కే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: