ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికార పార్టీకి చెందిన శాసన సభ్యుల్లో అప్పుడే పంతాలు, పట్టింపులు మెదలయ్యాయి. గుంటూరులో లాబీయింగ్‌ ముమ్మరం చేశారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేతలు.  పల్నాడు పేరుతో డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని కొందరు అంటుంటే , మరికొందరు శాసన సభ్యులు నరసరావుపేటను డిస్ట్రిక్ట్  చేయాలని అంటున్నారు.

 

రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికలకు ముందే పార్లమెంటు కేంద్రాన్నిడిస్ట్రిక్ట్  చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతాన్ని కలపి పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేసి, గురజాలను డిస్ట్రిక్ట్  కేంద్రంగా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జోరందుకుంది. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటుగా గురజాల ఎమ్మెల్యే  ఇదే విషయాన్ని స్దానిక నాయకత్వానికి చెప్పారని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ అభివృద్ది సమావేశంలో కూడా ఇదే విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

 

మరోవైపు మోడీ ప్రభుత్వం  ప్రకటించిన మెడికల్ కళాశాల ఏర్పాటుపై ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా కొత్త డిస్ట్రిక్ట్  ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు లోకల్ లీడర్స్ . నరసరావుపేటకు వచ్చిన సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం వద్ద కూడ ఇద్దరు శాసన సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. నరసరావుపేటను జిల్లా  చేసి.. జిల్లా కేంద్రంగా ఉంచే విదంగా చూడాలని ఎమ్మెల్యేలు..జిల్లా స్దాయి అధికారుల కార్యాలయాలు తమ ప్రాంతంలోనే ఉండాలంటూ శాసన సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి వద్ద కూడ పంచాయితీకి పెట్టారు. అటు మాచర్ల నియోజకవర్గంలో రెవిన్యూ ముఖ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తే అందరికి సమాన దూరంగా ఉంటుందని శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి  అన్నారు. పల్నాడు ప్రాంతానికి మాచర్లసెంటర్‌గా ఉంటుందని అన్నారు. అటు వినుకొండ నియోజకవర్గంలో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తే అందరికి సమాన దూరంలో ఉంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: