ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టారా...? అందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ని వాడుకోవాలని చూసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా తన వ్యూహాలకు పదును పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి గాను ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.

 

రాజధానిగా అమరావతిని ఉంచాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఆ విధంగానే కుట్రలు కూడా చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రాయలసీమ ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకోవాలని, వైసీపీ మీద వ్యతిరేకత ఉందని కొన్ని నివేదికలను ఏబీ ద్వారా తయారు చేయించారు చంద్రబాబు. ఈ విషయం బయటకు పొక్కింది. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు టార్గెట్ చేసినట్టు సమాచారం. వారి అందరిని పార్టీలోకి తీసుకోవాలని, అందుకు వ్యూహాలు కూడా సిద్దం చేసినట్టు తెలుస్తుంది.

 

మూడు రాజధానులు రాయల సీమ ప్రజలకు ఇష్టం లేదని, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఇష్టం లేదని అంతర్గతంగా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వంలో ఉన్న కొందరు అధికారులను ఏబీ ద్వారా ప్రభావితం చేసే విధంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని జగన్ గుర్తించే ఏబీ మీద పరోక్షంగా చర్యలు తీసుకున్నారని అంటున్నారు. వారిలో కొందరికి పదవులను కూడా ఎరవేసినట్టు తెలుస్తుంది. అందుకే ఎబీని పూర్తిగా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 

 

అస‌లు చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఆడిన రాజ‌కీయ డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ఓ పోలీస్ అధికారిగా.. అందులోనూ ఐపీఎస్ హోదాలో.. ఇంటిలిజెన్స్ అడిష‌న‌ల్ డీజీగా ఉండి పాల‌న‌ను బ్ర‌ష్టు ప‌ట్టించేందుకు త‌న వంతుగా సాయం చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. అందుకే టీడీపీ వాళ్లు సైతం వెంక‌టేశ్వ‌ర‌రావు ను బాబు పూర్తిగా న‌మ్మి నిండా మునిగార‌న్న విమ‌ర్శ‌లు చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: