నిఖిల్ గౌడ అంటే వెంటనే ఎవరికీ గుర్తు పట్టకపోవచ్చు. కానీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా కూడా  కాదంటారా..? అయితే, జాగ్వార్ సినిమా టైటిల్‌ ను తలుచుకోగానే ప్రత్యక్షమవుతాడు ఆయన. ఎందుకుంటే ఆ సినిమా అంతటి డిజాస్టర్‌ గా నిలిచింది కాబట్టి. 

 

పెళ్లి తేదీపై పుకారు..

 

ఇంతక ముందు జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో సినీ నటి అయిన సుమలత మీద ఎంపీగా పోటీ చేశాడు. అయితే ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే అయినా స్వర్గీయ అంబరీష్ క్రేజ్ ముందు నిఖిల్ నిలబడలేకబోయాడు. అయితే ఆయన మరణంతో సుమలతకు సింపతీ ఓట్లు బాగానే పడడంతో అప్పుడు సుమలత గెలిచారు. దీనితో రాజకీయాల్లో కూడా నిఖిల్‌కు చుక్కెదురైంది.

 

నిఖిల్‌పై విమర్శలు..

 

ఇవన్నీ ఇలా ఉండగా మరోవైపు రాజకీయాలలో ఉంటూ తండ్రికి చేదోడుగా నిలుస్తున్న నిఖిల్ మరో వైపు సినిమా హీరోగా కూడా ఎదిగే ప్రయత్నం చేశాడు. తెలుగు, కన్నడ భాషలలో జాగ్వార్ అనే సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పోనీ రాజకీయాల్లోనూ ఏదైన సాధించాడా అనుకుంటే అది లేదు దీనితో అతనిపై విమర్శల దాడి ఎక్కువైంది.

 

 

అయితే ప్రస్తుతం జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకైన నిఖిల్ గౌడ నిశ్చితార్థం రేవతితో ఘనంగా జరిగింది. బెంగళూరు సిటీలోని తాజ్‌ వెస్టెండ్‌ హోటల్లో వీరి నిచితార్థం ఘనంగా చేశారు. ఈ వేడుకకి సినీ తారాలు, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరయ్యరు. తొందరలో వీరి పెళ్లిని రామనగర చెన్నపట్టణ మధ్యలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: