ఢిల్లీలోని గార్గీ కాలేజ్ లో నిర్వహించే వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో బయట  నుంచి పోకిరీలు ప్రవేశించి  అమ్మాయిల తో అసభ్యంగా ప్రవర్తించారు. ఈరోజు  విద్యార్థునులు  ఈ ఘటనపై ఆందోళనకు దిగారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై అక్కడి సెక్యూరిటీ గా వచ్చిన  పోలీస్ లకు గాని... కాలేజ్  సిబ్బంది గాని ఇలాంటి ఘటన జరిగినట్లు తమకు సమాచారం లేదు అంటూ చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళితే... కాలేజీ క్యాంపస్లో రివర్ ఈ పేరిట సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది పోకిరీలు కాలేజ్ ఎంట్రెన్స్ వద్ద గుమిగూడారు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న ఆ పోకిరీలు కాలేజీ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 

 

 

 కాలేజీ లోపలికి వెళ్లకుండా ఎంట్రెన్స్ గేట్ వద్ద అడ్డుకొని అసభ్యంగా ప్రవర్తించారు. కొంతమందిని  వెంబడించి మరి చిత్రహింసలకు గురిచేశారు. దాదాపు 30 నుంచి 35 మంది పోకిరిలు ఉండగా...  వారిలో సగం మంది మద్యం మత్తులోనే ఉన్నారని విద్యార్థునులు  చెబుతున్నారు.క్యాంపస్లో  కాలేజీ అమ్మాయిలను వెంటబడి మరీ తరిమారని  ఈ క్రమంలోనే ఫస్టియర్ విద్యార్థి కిందపడి స్పృహ కూడా కోల్పోయింది అంటూ ఆరోపించారు విద్యార్థులు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి తన పై పోకిరి వ్యవహరించిన తీరును వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను కాలేజీ లోపలికి  వెళ్తున్న సమయంలో అక్కడున్న పోకిరీలు అందరూ తనను అడ్డుకున్నారని. ఈ క్రమంలోనే మూడుసార్లు తనపై అసభ్య చేష్టలతో విసిగించాడు అంటూ విద్యార్థి తెలిపింది. 

 

 పోకిరి లో నుంచి బయటపడి ఖాళీ ప్రదేశానికి వెళ్ళిన  తర్వాత... ఓ వ్యక్తి తన వైపే చూస్తూ హస్త ప్రయోగం చేయడం మొదలు పెట్టాడు అని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది విద్యార్థిని . దీంతో భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టానని... నా వెంటే  పరిగెత్తుతూ వచ్చిన ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆ పోకిరీలు నన్ను వెంబడిస్తున్న టు చెప్పింది అంటూ ఆ విద్యార్థి తెలిపింది.కాగా  జరిగిన ఘటన గురించి సోమవారం కాలేజీ విద్యార్థులు కాలేజీ బయట ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా  వ్యవహరించడం వల్ల తమకు ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు కాలేజీ విద్యార్థులు  ఇదిలా ఉంటే కాలేజ్  ప్రిన్సిపాల్ ప్రమీలా కుమార్ మాత్రం జరిగిన ఘటన గురించి తమ దృష్టికి రాలేదని చెప్పింది. తాము  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు బాడీగార్డ్ లతో  పాటు కమాండోలను  కూడా పెట్టామని తెలుపగా... అటు పోలీసులు కూడా మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు అని తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: