ఏ దేశంలోనైనా సురక్షిత శృంగారానికి కండోమ్స్ వాడండి అని ప్రభుత్వాలే ప్రచారం చేస్తూ వస్తుంటాయి. సుఖ వ్యాధులైన ముఖ్యంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలామంది ఈ కండోమ్స్ ని ఉపయోగిస్తారు. ఇవి అంతే కాకుండా అవాంచిత గర్భానికి చోటుఇవ్వకుండా కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయని అందరికి తెలిసిన విషయమే.

 

 

మాములుగా కండోమ్ లు వాడాలంటూ ప్రతి దేశంలోని ఆ దేశ ప్రభుత్వాలే చెబుతూ వస్తాయి. కానీ, బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దాదాపు మొత్తం 90 వేల కండోమ్ ప్యాకెట్లను సీజ్ చేసింది. ఆ కండోమ్స్ వాడకండి అంటూ ప్రజలకు వార్నింగ్ చేశారు అక్కడి అధికారులు. దీనికి కారణం నిబంధనలకు విరుద్ధంగా, భద్రతకు ఆస్కారం లేని 90 వేల కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ కండోమ్స్ వాడకండి అంటూ ప్రజలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. 2018, 2019 ఈ రెండు సంవత్సరాల కాలంలోనే వీటన్నింటినీ సీజ్ చేయడం ఆలోచించాలిసిన విషయం.  "ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులరేటరీ ఏజెన్సీ" ఈ విషయాన్ని అక్కడ అధికారికంగా ప్రకటించింది.

 

 

వారు సీజ్ చేసిన వాటిలో ఎక్కువ శాతం ఎక్స్ పైరీ డేట్ ముగిశాయని, అలాగే మరికొన్ని భద్రతా పరీక్షలు చేయకుండా వాటిని తాయరు చేశారని, మరి కొన్ని ప్యాకెట్ల కవర్లపై ఎలంటి చట్టపరమైన హెచ్చరికలు కూడా లేవని వారు తెలిపారు. ఒక్క 2018 సంవత్సరంలోనే 87,500 కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ బార్డర్ ఫోర్స్ అధికారులు వాటిని కనుగొని సీజ్ చేసారంట.

 

 

అయితే, ఎవరైనా కండోమ్స్ కొనుగోలు చేసేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలని వారు చెబుతున్నారు. వైద్యులు చెప్పిన సూచనల మేరకే వాటిని కొనుగోలు చేస్తే మంచిదని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో కండోమ్ లు చాలా వరకు చలామణి అవుతున్నాయని వారు తెలిపారు. ఇలాంటివాటి వలన గర్భనిరోధకాన్ని అరికట్టలేమని, అలాగే ఇంకా దీనితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వారు ప్రజలకి హెచ్చరిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: