ఒక ఉపద్రవం ఎంతటి విపత్తును కలిగిస్తుందో చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌ను చూసి తెలుసుకోవచ్చూ. ఆనందంగా, నచ్చిన విధంగా తింటూ బ్రతుకుతున్న చైనా దేశస్దులను కబళించిన వ్యాధి కరోనా.. ఈ వ్యాధి వల్ల చైనా వ్యవస్ద మొత్తం అతాలకుతలం అయ్యింది.. ఎలా వ్యాపించిందో తెలియని ఈ వ్యాధిపై ఇప్పటికే పలురకాలైన వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 908 కి చేరింది. మొత్తంగా ఈ వైరస్‌ 40వేల మందికి పైగా సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 296 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

 

 

ఇకపోతే ఆదివారం ఒక్కరోజే 97 మంది మృత్యువాతపడగా.. మరో 3,062 మందిలో ఈ వైరస్‌ను గుర్తించారు. వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్‌లోనే 91 మంది చనిపోగా. మరో 4,008 మంది అనుమానితులకు ఆదివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇక హాంకాంగ్‌లో 36, మకావులో 10, తైవాన్‌లో 18 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. భారత్‌లో మూడు కేసులు సహా మొత్తం విదేశాల్లో ఇప్పటి వరకు 300 కరోనా కేసులు నమోదయ్యాయని నివేధికలు వెల్లడిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఇప్పుడు చైనా వెళ్లాలంటే ప్రతి వారికి వణుకు మొదలైంది.. ఇక ఈ దేశంలో ఈ వ్యాధి ఇంకా సోకకుండా తీసుకునే రక్షణ చర్యలను ముమ్మురం చేసారు..

 

 

కాగా ఇప్పటికే చైనాలో వీధులన్ని నిర్మానుష్యంగా మారగా, విమానాశ్రయాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి రాకపోకలు సాగించే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ప్రయాణికుల అందరిపైనా ఒక మందును స్ప్రే చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది... అక్కడి విమానాశ్రయంలో పూర్తిగా ముఖాన్ని మాస్కులతో కప్పుకుని దిగుతున్న వారి ఒంటిపైనా ఈ మందును స్ప్రే చేస్తున్న సిబ్బంది. అందరిపై వరుసగా అత్యంత జాగ్రత్తగా పిచికారి చేస్తున్నారు.

 

 

వీరి వాలకాన్ని చూస్తుంటే ఇంతవరకు ఎవరు కూడా చెట్లకు పురుగుల మందును కూడా ఇంత జాగ్రత్తగా కొట్టలేరేమో అనిపిస్తుంది ఈ వీడియోల కనిపించే దృష్యాలు చూస్తుంటే....  ఇక చైనాలో తిరుగుతుంది కత్రినా కైపో, కరీనా కపూరో కాదు.. కరోనా వైరస్.. అందుకే ఈ మాత్రం జాగ్రత్తలు ఇప్పుడు చేపట్టారు గాని. ఈ వ్యాధి అందుబాటులోకి వచ్చాకా తినడానికి నోరున్నదని, ఏదిపడితే అది తినడం మానేస్తే మంచిదంటున్నారు కొందరు పెద్దలు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: