తెలుగుదేశంపార్టీ బాగా బరితెగించినట్లే కనబడుతోంది. ప్రభుత్వం లేకపోతే అధికారపార్టీ మీదున్న కోపాన్నంతా   చివరకు అసెంబ్లీ సెక్రటరీ మీద చూపిస్తోంది. శాసనమండలిలో  ఛైర్మన్ ప్రకటించిన సెలక్ట్ కమటి ప్రక్రియ చట్ట విరుద్ధమని సెక్రటరీ చెప్పటాన్ని టిడిపి సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఏకంగా సెక్రటరీ దగ్గరకు వచ్చి తాము చెప్పినట్లుగా వినకపోతే  తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి సెలక్ట్ కమిటి పరిశీలను బిల్లులను పంపుతున్నట్లు  ఛైర్మన్  చేసిన ప్రకటన చెల్లదు. ఆ విషయం తెలిసినా ఛైర్మన్ తప్పుల మీద తప్పులు చేస్తునే ఉన్నారు. తన ఆదేశాలను అధికారులు పాటించటం లేదన్న కారణంతో తానే సభ్యులను ప్రతిపాదించమని ఛైర్మన్ పార్టీలను  కోరటమే వింతగా ఉంది. పనిలో పనిగా వైసిపిని అడక్కుండానే తనంతట తానుగానే సభ్యులను నియమించేశారు.  ఇలా తనకు ఏది తోస్తే అలా చేసేస్తు తాను చెప్పినట్లు చేయాల్సిందేనంటూ సెక్రటరితో పాటు ఇతర అధికారులపై ఛైర్మన్ ఒత్తిడి తెస్తున్నారు.

 

ఈ నేపధ్యంలోనే సెలక్ట్ కమిటి ప్రకటన దగ్గర నుండి ఛైర్మన్ చేస్తున్న తప్పులను అధికారులు నేరుగా ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కే ఓ లేఖ రాసేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేకపోతున్నట్లు సెక్రటరీ ఛైర్మన్ కు లేఖ రాసేశారు. దాన్ని అవమానంగా భావించిన టిడిపి సభ్యులు నేరుగా సెక్రటరీ దగ్గరకే వచ్చి బెదిరింపలకు దిగటం గమనార్హం.

 

ఆదేశాలను ఉల్లంఘిస్తున్నందుకు సెక్రటరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని, కేంద్రానికి కంప్లైంట్ ఇస్తామని, కోర్టుకీడుస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు టిడిపి సభ్యులు. నిబంధనలను ఉల్లంఘించైనా సరే అధికారులు తాము చెప్పినట్లే వినాలనే చంద్రబాబునాయుడు ఆలోచనల వల్లే శాసనమండలిలో కంపు మొదలైంది. తెరవెనుక నుండి ఛైర్మన్ ను చంద్రబాబు, యనమల నడిపిస్తున్నారని వైసిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు చూస్తుంటే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: