రాజకీయ నాయకులైనా... అధికారులైనా అంతిమంగా పని చేయాల్సింది ప్రజల కోసమే. రాజకీయ నాయకులు శాసనాలు చేసినా  వాటిని నిబంధనల మేరకు అమలు పరిచే బాధ్యత అధికారుల పైన ఉంటుంది. ప్రభుత్వానికి నాయకులు, అధికారులు రెండు కళ్ళులా పనిచేయాలి. అయితే ఆ బాధ్యతను నిబంధనల మేరకు రాజ్యాంగంలో సూచించిన విధంగా పనిచేస్తేనే ఫలితం ఉంటుంది. అలాకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా ముందుకు వెళితే ఎప్పటికైనా బొక్క బోర్లా పడడం తప్పదు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు ఇటువంటి వ్యవహారం మరోసారి బయటపడింది.


 ఆయా పార్టీల మీద తమకున్న అభిమానాన్ని బయటకు వెల్లడిస్తూ.. రాజకీయ నాయకుల మెప్పు కోసంప్రయత్నిస్తూ ముందుకు వెళితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్కసారిగా కిందకు పడిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది అధికారులు తమ పలుకుబడిని పెంచుకునేందుకు రాజకీయ నాయకులకు సన్నిహితంగా మెలుగుతూ ప్రజలలో విమర్శల పాలయ్యారు. అయితే కొంతమంది దీనిని గమనించి జాగ్రత్తపడితే మరికొంతమంది మాత్రం అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. తాజాగా అడిషనల్ డిజిపిగా ఉన్నఏబీ వెంకటేశ్వరరావు ఉదంతాన్ని పరిశీలిస్తే ఇది ఉద్యోగస్తులకు పెద్ద గుణపాఠంగా కనిపిస్తుంది.


 ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటూ నిబంధనలు పట్టించుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదం అనే విషయం మరోసారి బయటపడింది.టీడీపీ ప్రభుత్వం లో ఏబీ వెంకటేశ్వరరావు చేసిన నిర్వహాలు అన్నీ ఇన్నీ కాదు. తన కుమారుడు కంపెనీ పేరుతో విదేశాల నుంచి నాసిరకం ఆయుధాలను కొనుగోలు చేయడంతో పాటు దేశ రహస్యాలను విదేశాలకు తెలిసేలా చేశారనేది ఆయన మీద ఉన్న అభియోగాలు.దీని కారణంగానే  వెంకటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. అంతే కాకుండా ఆయన విజయవాడ దాటి బయటకు వెళ్ళకూడదనే  నిబంధనలో కూడా చిక్కుకున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించి ఏబీ  వెంకటేశ్వరరావు అప్పటి ప్రతిపక్షం వైసీపీని టార్గెట్ గా చేసుకున్నారు.


 ఆఖరికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ, మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు టికెట్లు విషయంలోనూ ఈయనే చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనపై కేసు నమోదు అవ్వడంతో  మిగతా ఉద్యోగస్తులు కూడా ఆందోళనగా ఉన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్సు చీప్ గా ఉన్న సమయంలో ఆయన ఏది చెబితే అదే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించేవారనే  వాదన కూడా రాజకీయ వర్గాలల్లోనూ  పోలీసు వర్గాల్లోనూ ఉండేది. 


ఇప్పుడు టిడిపి ప్రతిపక్షంలో ఉండటం.. రాజకీయంగా ఇబ్బందులు పడుతూ వస్తున్న తరుణంలోనే ఇప్పుడు వెంకటేశ్వరరావు కుమారుడు వ్యవహారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. రాజకీయ ఉద్యోగ వర్గాల్లో దీనిపైన జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులతో అంటకాగుతూ నిబంధనలు పట్టించుకోకపోతే ఇలాగే ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం అధికారులు పని చేయకపోతే ఏబీ వెంకటేశ్వరరావు వలె ఎప్పటికైనా గుణ పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది అనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: