ప్రజలకు మంచి చేసే విషయంలో తాను ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు ఏపీ సీఎం జగన్ నిద్ర పోరు... నిద్రపోనివారు అనే విషయాన్ని జగన్ కు అత్యంత సన్నిహితులు తరచుగా చెప్పే మాట. ఆ విధంగానే జగన్ తాను తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే వరకు వదిలిపట్టకుండా వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలోనూ ఇది బయట పడుతోంది. ముఖ్యంగా అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలించే విషయంలో, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలోనూ జగన్ నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేకు పడినా.. దానికి సంబంధించిన కసరత్తు మాత్రం జగన్ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. 


ఇప్పుడు కాకపోయినా మరో రెండు నెలల్లో మూడు రాజధానులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా తన నిర్ణయం అమలు అవుతుందని అంచనా వేస్తున్న జగన్ దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.  తాజాగా సిబ్బంది కేటాయింపుల్లో వేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధానిగా రూపుదిద్దుకుంటున్న కర్నూలుకు ఎంత మంది సిబ్బందిని తరలించాలి..?  సిబ్బంది కేటాయింపుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. న్యాయ విభాగం పరిధిలో ఉండే శాఖలు, వాటి కార్యాలయాలు, సిబ్బంది తదితరు విషయాలపై సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరుపుతోంది. ఎవరెవరు అమరావతి నుంచి తరలి వెళ్ళేందుకు సుముఖంగా ఉన్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.


 విజిలెన్స్ విభాగాన్ని సచివాలయం నుంచి వేరుచేసి కర్నూలుకు తరలించే అంశంపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానికి ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు..? వారికి క్వార్టర్ లు ఎన్ని అవసరం ? సిబ్బందికి ఎటువంటి క్వాటర్స్ కేటాయించాలి ? వాటికి భవనాలు ,రోడ్లు అవసరమైన మౌలిక సదుపాయాలు విషయంపైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అధికారికంగా మూడు రాజధానులు మద్దతుగా నిర్ణయం వెలువడిన వెంటనే పరిపాలనను కొనసాగించవచ్చని జగన్ అభిప్రాయపడుతున్నారు.


 ఆ దిశగా వేగంగా కసరత్తు చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో  సంపూర్ణ మద్దతు ఉండడంతో తన నిర్ణయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే అభిప్రాయం జగన్ లో  ఉండటంతోనే ఈ ప్రక్రియ అంతా ఇప్పటి నుంచే మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: