2019 ఎన్నికలు చంద్రబాబు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోలుకోలేని విధంగా తీర్పు ఇచ్చారని గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలామంది రాజకీయ మేధావులు కామెంట్ చేశారు. కొద్దిలో ప్రతిపక్షం కూడా పోయే విధంగా చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా మిగిలి ఉందని అయితే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి మాత్రం చంద్రబాబుని నానా విధాలుగా రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీటన్నిటినీ తట్టుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సాము లాంటిదే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

ఇప్పటికే అనేక విషయాలలో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఏపీ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై రావడంతో టిడిపి పార్టీలో ఉన్న నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కి భయపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని విషయాలలో చంద్రబాబు చేతులెత్తేసిన ట్లు టిడిపి పార్టీ వర్గాల వినబడుతున్న టాక్. కృష్ణాజిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పైగా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం అంటే టీడీపీకి ఎప్పటినుండో ఫేవర్ నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు చాలా లైట్ తీసుకున్నారట.

 

ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీ పార్టీపై మరియు చంద్రబాబుపై ఆయన కుమారుడు పై దారుణంగా మీడియా ముందే భయంకరమైన విమర్శలు చేయడం జరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరో అభ్యర్థిని తయారు చేయాలని వంశీకి ప్రత్యామ్నాయంగా ఇంకో లీడర్ ని రంగంలోకి దింపాలని చంద్రబాబుకి సూచించారట. అయితే గన్నవరం నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీ అసలు క్యాడర్ లేదని...ఉన్న క్యాడర్ మొత్తం వంశీ కి మద్దతుగా ఉందని దీంతో చంద్రబాబు గన్నవరం నియోజకవర్గం విషయంలో ఆశలు వదిలేసుకున్నటు టిడిపి పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: