మొత్తానికి ఇంతకాలం నివురుగప్పిన నిప్పులాగున్న వివాదం కాస్త ఒక్కసారిగా బయటపడిపోయింది. శాసనమండలి ఛైర్మన్ గా  ఎంఏ షరీఫ్ కున్న అధికారాలేంటో సెక్రటరీ లేఖలో స్పష్టంగా చెప్పేశారు. సెలక్ట్ కమిటి పరిశీలను బిల్లులను తనంతట తానుగా ప్రకటించే అధికారం ఛైర్మన్ కు లేదని కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలిస్తే పాటించాల్సిన అవసరం తమకు లేదనే అర్ధంవచ్చేట్లుగా స్పష్టం చేసేశారు.

 

అసలు మండలి ఛైర్మన్ కు సెక్రటరీ ఎందుకు లేఖ రాయాల్సొచ్చిందంటే మొదటి రోజు నుండి షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి. ఛైర్మన్ కున్న అధికారాలేంటో సెక్రటరీ స్పష్టంగా వివరించి చెప్పినా షరీఫ్ వినిపించుకోవటం లేదు. ఎందుకు వినిపించుకోవటం లేదంటే తెరవెనుక నుండి చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి నేతలు జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించమని ఛైర్మన్ ను ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి. ఈ విషయాన్ని మంత్రులు మొదటి నుండి ఆరోపిస్తునే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 

తనపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఛైర్మన్ పదే పదే సెక్రటరీని పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేస్తునే ఉన్నారు. ఒకవైపు నిబంధనలను ఉల్లంఘించాలంటూ ఛైర్మన్ నుండి ఒత్తిళ్ళు. అదే సమయంలో నిబంధనల ప్రకారమే వెళ్ళమంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు. ఈ రెండింటి మధ్య చాలా రోజులుగా అధికారులు నలిగిపోతున్నారు. మొత్తానికి ఏదైతే అది అయ్యిందని సెక్రటరీ ఛైర్మన్ కు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తాము వెళ్ళలేమంటూ స్పష్టంగా చెప్పేశారు.

 

దాంతో ఛైర్మన్ తో పాటు టిడిపి ఎంఎల్సీలు ఇపుడు సెక్రటరీపై మండిపోతున్నారు. చూడలి ఏమవుతుందో ? నేరుగా నలుగురు ఎంఎల్సీలు సెక్రటరీ దగ్గరకే వచ్చి ఛైర్మన్ చెప్పినట్లు  వినకపోతే  కోర్టుకు వెళతామని, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామంటూ బెదిరిస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకుందామని టిడిపి సభ్యులు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: