వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు రీవెరిఫికేషన్ చేస్తున్నారని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం దొంగ పెన్షన్లు ఇచ్చిన మాట వాస్తవం అని ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను కట్టేవారికి, కార్లలో తిరిగే వారికి పెన్షన్లు ఇచ్చారని, జన్మభూమి కమిటీలు వారికి ఇష్టం వచ్చిన వారికి పెన్షన్లు మంజూరు చేశాయని అది ఏ మాత్రం ధర్మమో ప్రజలు ఆలోచించాలని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తుందని దీని గురించి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరికీ పెన్షన్ తొలగించదని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని జగన్ చెప్పారని ఇళ్ల పట్టాల కోసం విశాఖలో 1,73,000 ధరఖాస్తులు వచ్చాయని అన్నారు. 
 
ల్యాండ్ పూలింగ్ 13 జిల్లాల్లో జరుగుతోందని కేవలం విశాఖలో మాత్రమే కాదని కానీ చంద్రబాబు, చంద్రబాబు అనుకూల వర్గం మాత్రం విశాఖపై పడిందని అన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను ఏదో ఒక విధంగా దెబ్బ తీయాలని, విశాఖను ఏదో ఒక విధంగా అప్రతిష్టపాలు చేయాలని ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పేదవారికి ఇళ్లపట్టాలు ఇవ్వటానికి అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. 
 
ల్యాండ్ పూలింగ్ కోసం అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు తీసుకుంటున్నామని అసైన్డ్ ల్యాండ్స్ తీసుకున్న వాళ్లకు కూడా ఎకరాకు 900 గజాలు అభివృద్ధి చేసి ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి కూడా 250 గజాలు ఇస్తామని వారి ఉపాధి దెబ్బ తినకూడదని సీఎం జగన్ ల్యాండ్ డెవలప్ చేసి ఇస్తున్నామని అన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: