జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా ? మేల్కోకుంటే ప్రమాదం తప్పదా ? ఇపుడిదే విషయమై పార్టీలోను, ప్రభుత్వంలోను పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డేంజర్ బెల్స్ అంటే ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కానీ ప్రభుత్వం  మ్యాగ్జిమమ్ గబ్బు పట్టటం ఖాయంగానే అనిపిస్తోంది. తాజాగా తలెత్తిన కియా కార్ల ఉత్పత్తి ప్లాంట్ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

అనంతపురం జిల్లాలోని కియా కార్ల ఉత్పత్తి ప్లాంట్ తమిళనాడుకు తరలిపోతోందంటూ రెండు రోజుల క్రితం ప్రముఖ మీడియా సంస్ధ రాయటర్స్ ఓ కథనాన్ని ఇచ్చింది. రాయటర్స్ లో కథనం వచ్చిందో లేదో జాతీయస్ధాయిలో సంచలనమైపోయింది. సరే ప్రభుత్వం, కియా యాజమాన్యం రిజాయిండర్లు ఇవ్వటం మామూలే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిప్పు లేనిదే పొగ రాదు కదా ? అనే చర్చ పార్టీలో నే జరుగుతోంది. అంటే పార్టీలోని కీలక నేతలెవరో యాజమాన్యాన్ని బాగా ఇబ్బంది పెట్టే ఉంటారని చర్చలు జరుగుతున్నాయి. కార్లను రిలీజ్ చేసే సమయంలో హిందుపురం ఎంపి గోరంట్ల మాధవ్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

 

అంటే ఆ తర్వాత కూడా  జిల్లాలోని నేతలెవరైనా యాజమాన్యాన్ని ఏ విషయంలో అయినా  ఇబ్బంది పెట్టారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.  నిజానికి బయట ఏం జరుగుతోందో తెలుసుకునే వ్యవస్ధ జగన్ కు ఉందో లేదో తెలీటం లేదు.  నిజంగానే ఉండుంటే కియా ఉత్పత్తి ప్లాంటు విషయంలో ఇంత గొడవ జరిగేది కాదు. బయట ఏం జరుగుతోందో తెలుసుకునే వ్యవస్ధ ఉంటే బాధ్యులను వెంటనే పిలిపించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది.

 

అలాంటి వ్యవస్ధ గనుక లేకపోతే వెంటనే  ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం జగన్ పైనే ఉంది. తాను చెప్పేది పార్టీ నేతలు వినటం కాదు. పార్టీ నేతలు చెప్పేది కూడా జగన్ వినటం అలవాటు చేసుకోవాలి. వైఎస్సార్ సక్సెస్ లో ఇటువంటి వ్యవస్ధ కూడా కీలకమైన పాత్ర పోషించిదని జగన్ మరచిపోయినట్లున్నారు. ప్రభుత్వం నుండి ఎలాగూ క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతోందనే ఫీడ్ బ్యాక్ సక్రమంగా వస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి సొంతంగానే జగన్ ఏర్పాటు చేసుకోకపోతే జగన్ కు డేంజర్ బెల్స్ మొదలైనట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: