ఆధార్ కార్డు అనేది మనిషి జీవితంలో ఎంతగా అల్లుకు పోయిందో తెలిసిందే.. ఈ రోజుల్లో ఆధార్ లేకుంటే, కొన్ని కొన్ని పనులు జరగవని తెలిసిందే.. కానీ ఆధార్ కార్డు ఒక శవాన్ని కూడా ఇంతలా వేధించే పరిస్దితిని తీసుకు వస్తుందనుకోరు ఈ విషయం తెలిసినవారు.. మనిషికి బ్రతికి ఉన్నప్పుడు అవమానాలే, చివరికి చచ్చాక కూడా ఆ వేధింపులు తప్పడం లేదు అని ఇక్కడ జరిగిన సంఘటన నిరూపించింది.. అదేమంటే..

 

 

బెంగళూరు నగరంలోని విజయనగర్‌కు చెందిన రాజేష్ అనే యువకుడి మేనత్త మరణించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు, సుమనహళ్లి మున్సిపల్ శ్మశానవాటికకు తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు.. అయితే శవ దహనానికి శ్మశానవాటిక సిబ్బంది అభ్యంతరం చెప్పారట... ఇలా ఎందుకు చెప్పారో తెలిస్తే విన్నవారు కూడా షాక్ అవ్వాల్సిందే.. ఇక విషయానికి వస్తే బృహత్ బెంగుళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు సరికొత్త నిబంధన విధించారు..

 

 

ఇక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే తప్పని సరిగ్గా వర్జినల్ ఆధార్ కార్డ్ చూపించవలసిందేనట.. ఇలా ఎందుకంటే ఆ నంబరుతో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయాలని తెలిపారట.. అయితే మృతురాలి పేరిట ఉన్న ఆధార్ కార్డు పోవడంతో సమీపంలోని నెట్ సెంటరుకు వెళ్లి ఈఆధార్ కోసం ప్రయత్నించగా, రిజిస్టరు మొబైల్ నంబరు సిమ్ బ్లాక్ అయిందని తెలియడం తో, మరో మొబైల్ నంబరుతో ఈ ఆధార్ తీసుకువచ్చాకే మున్సిపల్ అధికారులు శవదహనానికి అనుమతించారట..

 

 

ఇక ఈ విషయంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా మరణించిన వారు బాధలో ఉండి ఇవన్ని పట్టించుకోరు, అలాంటి పరిస్దితుల్లో వారి దుస్దితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది... ఇక అసలే ఆధార్ కార్డ్ లేని వారి పరిస్దితి మరోలా ఉంటుంది. ఇది తలుచుకుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది.. ఏది ఏమైనా ఈ నిర్ణయం కాస్త కఠినమైందే అని అంటున్నారు అక్కడి ప్రజలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: