పప్పు... మాలోకం... ఇలా రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. తన ప్రసంగాల ద్వారా జనాల్లోనూ లోకేష్ అభాసుపాలవుతూ వస్తున్నాడు. అసమర్థ నాయకుడిగా ముద్ర వేయించుకున్నలోకేష్ తన ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నాడు.  ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు తనకు దక్కబోతుండడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా తొందర్లోనే టిడిపి పగ్గాలు దక్కించుకునే అవకాశం లోకేష్ కు ఉండడంతో దానికి అనుగుణంగానే సమర్ధుడైన నాయకుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వ్యవహారంలో ఆయన అనుకున్న మేరకు సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాడు.


 అధికార పార్టీ వైసీపీ మీద తీవ్రస్థాయిలో ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తాజాగా ఈ రోజు విజయవాడలో జరిగిన పెన్షన్ దీక్ష కు సంబంధించి లోకేష్ చేసిన ట్విట్స్  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేశాయి. ఆయన వాడిని డైలాగులు లోకేష్ ప్రస్తావిస్తూ జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాజశేఖర్ రెడ్డి తరచుగా చెప్పే మాటలు... ''మాట తప్పను... మడమ తిప్పను'' అలాగే జగన్ చెప్పిన ''నేను విన్నాను నేను ఉన్నాను'' డైలాగులను చెబుతూనే వైసీపీ ప్రభుత్వం పైనా జగన్ పైనా విమర్శలు చేశారు లోకేష్. లోకేష్ ట్విట్స్ ఈ విధంగా ఉన్నాయి. 


మొదటి సంతకం మాయ, పెన్షనర్లను మోసం చేశారు. నేను విన్నాను నేను ఉన్నాను 3 వేలు పెన్షన్ అన్న జగన్ గారు నేను వినలేదు, నేను లేను అంటూ 250 రూపాయలు చేశారు. అంటూ ఓ ట్విట్  పెట్టారు. మరో ట్వీట్లో రాజన్న రాజ్యం లో 60 ఏళ్లకే పెన్షన్ అని ఎనిమిది నెలలు అయినా 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్న జగన్ గారికి పండుటాకుల పై అంత కక్ష ఎందుకు అర్థం కావడం లేదు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్ ఈ స్థాయిలో విమర్శలు చేయడంపై టిడిపి శ్రేణులు ఆనందంగా ఉన్నాయి ఇక జనాలు కూడా లోకేష్ బాగా ఇంప్రూవ్ అయ్యాడనే భావన వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/naralokesh/status/1226765996771270656

మరింత సమాచారం తెలుసుకోండి: