ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఉద్యమం ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఆ ఉద్యమాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుకి నడిపిస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రధానంగా రాజకీయంగా ఉన్న తన బలహీనతను అధిగమించడానికి గాను బాబు గారు ఆ విధంగా రాజధాని ఉద్యమాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము మునిగిపోతామని తెలిసినా కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర నాయకులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చంద్రబాబు పాట పాడుతున్నారు.

 

ఇప్పుడు ఇదిలా ఉంటే విజయవాడలో రాజధాని కోసం యువత పెద్దగా రావడం లేదనే వ్యాఖ్యలు అక్కడ ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం యువతను ఆకట్టుకునే నాయకుడు ఆ పార్టీలో లేకపోవడమే అంటున్నారు. అవును ఇప్పుడు తెలుగుదేశ౦ పార్టీలో సమర్ధవంతమైన యువనేత లేరు. దేవినేని అవినాష్ ఉండి ఉంటే రాజధాని ఉద్యమం అనేది తీవ్రంగా ముందుకి వెళ్ళేది అని అంటున్నారు ఆ పార్టీ నేతలే. చంద్రబాబు అనవసరంగా అవినాష్ ని దూరం చేసుకుని యువ నాయకుడి అండను కోల్పోయారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

 

రాజకీయంగా కృష్ణా జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉన్నా పార్టీకి క్యాడర్ ఉంది. అయితే యువత మాత్రం పార్టీకి చాలా వరకు దూరంగా ఉంది. అందుకే అవినాష్ ఉండి ఉంటే యువత ఎక్కువగా వచ్చే వారని, చంద్రబాబు యువత రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ యువతతో పాటుగా విద్యార్ధులు ఎక్కువగా రాజధాని ఉద్యమం కోసం వచ్చే వారని, అవినాష్ కి ఉన్న వాల్యూ ఇప్పుడు చంద్రబాబుకి అర్ధమవుతుందని అంటున్నారు. 

 

ఇప్పటికే పార్టీలోకి తిరిగి వస్తే కృష్ణా జిల్లా బాధ్యతలతో పాటు కోరిన సీటు ఇస్తా అని కూడా రాయబారం పంపినట్టు సమాచారం. అయితే చంద్ర‌బాబు తీరుతో టీడీపీలో ఉన్న‌న్ని రోజులు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ అవినాష్ మాత్రం తిరిగి టీడీపీలోకి వ‌చ్చే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో ఉండ‌గా బ‌ల‌వంతంగా గుడివాడ పంపి ఓట‌మి కార‌ణం కావ‌డం.... ఇటు ఇచ్చిన ప‌ద‌వి కూడా నాన్చి నాన్చి ఎన్నిక‌ల‌కు ముందు ఇవ్వ‌డం న‌చ్చ‌కే అవినాష్ పార్టీని వీడి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: