రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... ఆ పార్టీని వీడటం అందరికీ షాక్ కలిగించిన విషయం తెలిసిందే. 2019 లో రెండోసారి టీడీపీ నుంచి గెలిచిన వంశీపై నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలు రావడంతో ఆయన ఒక్కసారిగా సీఎం జగన్‌తో భేటీ అయిపోయి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని ప్రకటించి, చంద్రబాబుకు వాట్సాప్ రాజీనామా కూడా పంపారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి, చంద్రబాబు ఇసుక కోసం దీక్ష చేసిన రోజునే బయటకొచ్చి మీడియా సమావేశం పెట్టి మరి బాబుపై విమర్శలు చేశారు.

 

తాను జగన్‌కు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చంద్రబాబు, వంశీని పార్టీని సస్పెండ్ చేయడం, ఇక వంశీ కూడా వైసీపీలో చేరకుండానే పరోక్షంగా మద్ధతు ఇచ్చేసి, అసెంబ్లీలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా కూర్చున్నారు. అయితే ఈ పరిస్తితి ఇలాగే కొనసాగేలా కనిపిస్తుంది. ఈ ఐదేళ్లు రెబల్ ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీలో చేరితే పరిస్తితులు మారే ఛాన్స్ ఉంది.

 

అయితే ఈ విషయం వదిలేస్తే, వంశీ వైసీపీకి మద్ధతు తెలపడం వల్ల ఏం ఒరిగింది అనే ప్రశ్న ఎదురైతే, వంశీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల చాలానే మేలు జరుగుతుందనే చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీలో ఉండి ఉంటే ఆయన నియోజకవర్గానికి అనుకున్న మేర నిధులు వచ్చేవి కాదు. అభివృద్ధి పనులు జరిగేవి కాదు. ఇప్పుడు వైసీపీలో ఉండటం వల్ల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బుడమేరు కాలువపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేసుకున్నారు.

 

అదేవిధంగా నియోజకవర్గాలో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ల నిర్మాణానికి దాదాపు 35 కోట్లు మంజూరు చేయించుకున్నారు. అటు పట్టిసీమ కాలువలపై రైతులకు ఉచిత మోటర్లు అందిస్తున్నారు. దానికి ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా నియోజకవర్గంలో బాగానే వస్తున్నాయి. ఈ విధంగా నియోజకవర్గానికి ఏ లోటు లేకుండా నిధులు వచ్చేలా చేసుకుంటున్నారు. మొత్తానికి వంశీ వైసీపీకి మద్ధతు ఉండటం వల్ల గన్నవరం ప్రజలకు చాలానే ఒరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: