దేవినేని ఉమా..తెలుగుదేశంలో సీనియర్ నేత. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఓ రకంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ...కృష్ణా జిల్లా టీడీపీలో వన్ మ్యాన్ షో చేసేవారు. అన్నిరకాలుగా జిల్లాపై పెత్తనం చేసేవారు. ఈయన 2004, 2009 సమయాల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్న జిల్లా టీడీపీని గ్రిప్‌లో పెట్టుకునే వారు.

 

అయితే 2019 ఎన్నికల తర్వాత ఉమా పూర్తిగా మెయిన్ ట్రాక్ నుంచి, సైడ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తొలిసారి ఓటమి పాలవ్వడంతో జిల్లా నేతలు ఉమాని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయన్ని ఏదో మెయిన్ లీడర్‌గా ట్రీట్ చేయట్లేదని అర్ధమవుతుంది. అటు పార్టీలో కూడా చంద్రబాబు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరీ లాంటి గెలిచిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఉమాకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

 

అసలు ఉమా అంటే ముందు నుంచి పడని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు అయితే ఆయన్ని పూచిక పుల్ల తీసినట్లు తీసేస్తున్నారని తెలిసింది. వీరేగాక మిగతా నేతలు కూడా ఈయన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడట్లేదు అంటున్నారు. అయితే ఉమా కూడా ఈ మధ్య ఒంటరిగానే మీడియా సమావేశాలు పెట్టడం, ఏదో అమరావతి కోసం పోరాటాలు చేస్తున్నట్లు కనపడుతుంది. ఏదో అనుచరులు తప్ప, ఉమా పక్కన పెద్ద పెద్ద నేతలు కనపడట్లేదు.

 

కాకపోతే రోజు మాత్రం మీడియాలో ఉంటూ...జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమరావతి వెళ్ళి రైతులు దీక్షలకు మద్ధతు తెలుపుతున్నారు. మొత్తానికైతే మొన్నటివరకు టీడీపీలో సెన్సేషనల్ నాయకుడుగా ఉన్న  ఉమా ఇప్పుడు సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: