జగన్...ఏదైనా మాట ఇస్తే..దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో..ఇప్పుడు అధికారంలోకి రాగానే తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆడపడుచుల కష్టాలని చూసి మద్యపాన నిషేదం దిశగా అడుగులేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. తన పాదయాత్రలో మద్యం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని గమనించిన జగన్..మద్యపాన నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి... అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు.

 

ఇక దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలిదశలో భాగంగా 20 శాతం షాపుపని మూసేసి, బెల్ట్ షాపులు లేపేసి, ఉన్న మద్యం షాపులని ప్రభుత్వమే నడిపేలా డిసైడ్ అయ్యి, అందులో కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించి  ముందుకెళుతున్నారు. ఈ విధంగా ఆదాయం తగ్గిన పర్లేదని తెలిసి కూడా, ఆడపడుచుల కోసం మద్యపాన నిషేదానికి పూనుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చే ఆదాయంలో కూడా నష్టం జరిగేలా చేస్తున్నారని తెలుస్తోంది.

 

కొన్ని కొన్ని ప్రాంతాల్లో మద్యం బ్రాండ్లలో మోసం జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని చోట్ల అధికార ధరలు ఉండే మద్యం బ్రాండ్లలో.. చీప్ రేట్ ఉన్న మద్య బ్రాండ్లని కలిపేసి అమ్ముతున్నట్లు సమాచారం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వైన్స్ సమయం ముగిశాక మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ బోర్డర్‌లో ఉన్న జిల్లాల నుంచి ఏపీకి మద్యం సరఫరా అవుతుందని, ఇంకా కొన్ని చోట్ల ఏదైనా ఫంక్షన్స్, పార్టీలకు పర్సనల్‌గా తెలంగాణ నుంచి మద్యం తెచ్చుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి ఇదంతా జరగడం వల్ల మద్యం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందనిపిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: