మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీ ఆ సమస్యల నుంచి పార్టీని ఏ విధంగా బయటపడాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కుంటోంది. నిస్తేజంలో ఉన్న పార్టీ నాయకుల్లో ఏ విధమైన ఆందోళన లేకుండా ఉత్సాహం కలిగించాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు తనకు అత్యంత ఆప్తుడు, తెలుగుదేశం పార్టీని పరోక్షంగా వెనుకుండి నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో మరింతగా చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడు. 


ఈ పరిణామాలు ఒక ఎత్తయితే, పార్టీలోని నాయకులు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం ఏపీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని సమర్థిస్తూ ఉండగా, ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో తెలుగుదేశం పార్టీ ఏబీ వెంకటేశ్వర విషయంలో రెండుగా చీలిపోయింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అయిన వెంటనే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ద్వారా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన వ్యక్తిని పిలిచి సన్మానం చేస్తారు అనుకుంటే ఇలా సస్పెండ్ చేస్తారా అంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడానికి ఏ వెంకటేశ్వరరావు కారణం అనేలా ఆయన స్పందించారు.


 దీనిపై కూడా అదే స్థాయిలో ఏబీ వెంకటేశ్వరావు రిప్లై ఇవ్వడం తదితర పరిణామాలు జరిగాయి. కొంతమంది టిడిపి నాయకులు ఏబీవీ కి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. అయితే ఇది పార్టీకి, చంద్రబాబు ఏబీ  వెంకటేశ్వరరావు కు మధ్య ఉన్న సాన్నిహిత్యం  దెబ్బతీసే విధంగా ఉండటంతో వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప తదితరులు ఏబీవీ కి మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారుల పై కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతోందని విమర్శలు చేశారు. అయితే ఒక వర్గం ఏబీవీ కి మద్దతుగా, మరో వర్గం వ్యతిరేకంగా తమ స్పందనను తెలియజేయడంతో ఈ వ్యవహారంపై   తెలుగుదేశం అధిష్టానం ఆగ్రహంగా  ఉన్నట్లుగా అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: