ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అంటే చాలు.. ఈ మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. తన ప్రెస్ మీట్లలో తరచూ ఈ రెండు పత్రికలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూడా మంత్రి బొత్స సత్యనారాయణ అదే పని చేశారు. ఈ రెండు పత్రికలను సూటింగా కొన్ని ప్రశ్నలు వేశారు. సాధారణంగా ఐటీ దాడులపై జోరుగా వార్తలు ఇచ్చే ఈ పత్రికలు చంద్రబాబు మాజీ పీఎస్ పై రోజూ ఐటీ దాడులు జరుగుతుంటే నోరు మెదపవేమని బొత్స ప్రశ్నించారు.

 

బొత్స ఏమన్నారంటే.. ” అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిని సస్పెండ్‌ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం మరో అధికారిపై ఐటీ దాడులు చేస్తోంది. వారు చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్‌ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు అయితే.. ఇంకొకరు చంద్రబాబు పర్సనల్‌ సెక్రటరీ. ఏబీ వెంకటేశ్వరరావుపై చర్య కక్షపూరితమని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స.

 

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. " మరి ఐటీ దాడులు జరుగుతున్నందుకు మీ పీఎస్‌పై కూడా కక్షపూరితమేనా..? పీఎస్‌ మీద ఐటీ దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు. బాబు వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు స్పందించడం లేదు.. దీనికి కారణం ఏంటీ..? ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తే మాత్రం సస్పెండ్‌ చేయకూడదా..? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

 

హుద్‌ హుద్‌ తుపాను వస్తే ఎక్కడో ఆనందపురంలో ఉన్న రికార్డులు మారిపోతాయని టీడీపీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి బొత్స. భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. మరి మంత్రి బొత్స ప్రశ్నలకు సదరు మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: