ఏపీ సీఎం జగన్ ఏదైనా అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకూ వదిలే రకం కాదు.. ఆయన ఉగాది నాటికి గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు దాని కోసం భూములు సమీకరిస్తున్నారు. విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అసైన్డ్ రైతుల నుంచి, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారి నుంచి భూములు సేకరించాలని అనుకున్నారు.

 

 

దీని కోసం ఓ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే.. ఇందుకోసం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో రైతులు ఎదురుతిరుగుతున్నారని.. ప్రభుత్వానికి భూమి ఇవ్వడం తమకు ఇష్టం లేదని అంటున్నారని తెలుగు దేశం అనుకూల పత్రికలు, మీడియా ఊదరగొడుతున్నాయి. అమరావతిలో రాజధాని కోసం పోరాడుతున్న రైతుల కూడా విశాఖ వాసులకు భూసమీకరణకు సమీకరించొద్దని అంటున్నారు.

 

 

అయితే అసలు విషయం ఏంటంటే.. విశాఖ జిల్లాలో మొత్తం 6 వేల ఎకరాల భూమి సమీకరించాలని అనుకున్నారు. ఈ పత్రికల ప్రచారం ఎలా ఉన్నా.. ఇప్పటికే సగం భూమిని సేకరించేశారట. దాదాపు 3 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చేశారట. ఈ విషయాన్ని ప్రభుత్వమే తాజాగా ప్రకటించింది. మొత్తం సేకరించాలనుకున్న 6116 ఎకరాల భూమిని 58 బ్లాక్‌లుగా విభజించారట.

 

 

వీటిలో ఇప్పటికే 25 బ్లాక్‌లు ప్రభుత్వానికి రైతులు ఇచ్చారట. మరికొద్ది రోజుల్లోనే మిగతా బ్లాక్‌లు పూర్తవుతాయట. ఎవరిపై ఏ విధమైన ఒత్తిడి చేయడకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేశామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. రిటర్న్‌ ప్లాట్స్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.150 కోట్లను విడుదల చేయాలని వీఎంఆర్‌డీఏకి ఆదేశాలిచ్చారు. అంతే కాదు..

 

అసైన్డ్‌ భూమిపై సాగు చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఎకరం అసైన్డ్‌ భూమి ఇచ్చిన వారికి వీఎంఆర్‌డీఏ ద్వారా డెవలప్‌మెంట్‌ చేసిన ప్లాట్లను 900 గజాలు, ఎంజాయ్‌మెంట్‌ చేసిన వారు 10 సంవత్సరాల పైబడి ఉంటే 450 గజాలు, ఐదు సంవత్సరాల పైబడి ఉంటే 250 గజాలు, సమావేశాలు పెట్టి ఒప్పించి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: