బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు... ప్రస్తుతం తెలంగాణ బీజేపీ లో కీలక నేతగా అధికార పార్టీ తీరును ఎండగడుతూ ఎప్పుడు బీజేపీలో యాక్టివ్ గా కనిపించే లీడర్ గా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో ఎంతగానో గుర్తింపు ఉన్న బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. మెదక్ జిల్లా ఆర్సీ పురం కు చెందిన ఓ మహిళ కేసు నిమిత్తం బిజెపి అధికార ప్రతినిధి న్యాయవాది అయిన రఘునందన్ రావు దగ్గరకు వెళితే మత్తు మందు ఇచ్చి తనపై  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ మహిళ ఆరోపణలు చేసింది. తన భర్తతో కుమ్మక్కై  రఘునందన్ రావు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసాడు అంటూ ఆరోపించింది. 

 


 అయితే ముందు  మనవ  హక్కుల కమిషన్ను ఆశ్రయించానని  ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రఘునందన్రావు బ్లూఫిలిమ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అని... తన దగ్గరికి కేసు నిమిత్తం వచ్చిన మహిళలు అందరినీ బెదిరించి అత్యాచారాలకు పాల్పడుతుంటాడు  అంటూ ఆరోపణలు చేసింది సదరు బాధిత మహిళ.ఇక  తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు తనపై ఎవరో కావాలని తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆమె ఎవరో తనకు తెలియదు అంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. 

 


 అయితే బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్న రఘునందన్ రావు ప్రస్తుతం లైంగిక  ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు నైతిక బాధ్యత వహిస్తూ తాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటాను అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఇన్చార్జి కృష్ణదాస్ కు లేఖ రాశారు. ఈ కేసులో కోర్టు నుంచి తుది తీర్పు వచ్చేంతవరకు తాను పార్టీకి సంబంధించిన ఏ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన కూడదు అని నిర్ణయించుకున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఎంతగానో గుర్తింపు ఉన్న రఘునందన్ రావు పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: