ఏబీ వెంకటేశ్వరరావు.. ఇటీవల సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలా ఓ ఐపీఎస్ సస్పెండ్ కావడం చూడలేదు. అందులోనూ ఇలాంటి రాజకీయ నేపథ్యంలో ఏ ఐపీఎస్ అధికారి కూడా ఇరుక్కోలేదు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు రూటే సెపరేటు అంటున్నారు ఆయన గురించి తెలిసిన కొందరు.

 

 

ఏబీ వెంకటేశ్వరరావు.. తన అవినీతి సంపాదనతో తెలంగాణలో పెద్ద ఎత్తున భూములు కొనేశారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 171 ఎకరాలు ఏబీ వెంకటేశ్వరరావు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారట. ఆ భూముల వివరాలు ఇలా ఉన్నాయి. తెంలాగణలోని నారాయణ్‌ పేట్‌ జిల్లా మక్తల్‌ మండలం పస్పూల్‌ గ్రామంలో 57 ఎకరాలు కొన్నారట ఏబీ వెంకటేశ్వరరావు.

 

 

అలాగే.. చిట్యాలలో 64 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేశారట అంతే కాదు.. ఈ భూములకు రైతు బంధు కింద ప్రయోజనం కూడా పొందారట. గత ఖరీఫ్‌లో ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా రూ.55 లక్షల ఆదాయం ఆర్జించారట.

 

 

అంతే కాదు.. జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారట. అందులో ఓ అధునాత గెస్ట్‌ హౌస్‌ను నిర్మించారట. ఇవి కాకుండా ఇంకా ఏమేం ఆస్తులున్నాయో లెక్కపెట్టే పనిలో ఉన్నారు కొందరు అధికారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: