ఏంటి ? టైటిల్ చూసి హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు అనుకుంటున్నారా? కాదు.. ఈమెది అదోరకమైన రాజకీయ చదరంగం.. అసలు కథ ఏంటి అంటే? ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో దిశ మహిళా పోలీసు స్టేషన్‌ నిన్న శనివారం ప్రారంభించారు. అయితే అందులో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దిశ మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. 

 

అయితే ఆ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడిందని తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 డిసెంబర్ నెల 16వ తేదీన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో మద్యం పాలసీపై  చర్చ జరుగుతుండగా  బ్రాండెడ్ మద్యం అమ్మకాలు జరపడంలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. 

 

అలా పూయించడమే కాకుండా ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు కూడా చేశారు. దీంతో ఆదిరెడ్డి భవాని సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యల చేస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సెక్రటేరియట్ పరిధిలో ఉంది. అయితే ఆ ఘటన జరిగిన 55 రోజులకు ఆమె మళ్లీ ఈ విషయంపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయమన్నారు. 

 

దీంతో ఈ కేసుపై తూర్పుగోదావరి అర్బన్ జిల్లా ఏఎస్పీ లతా మాధురి మాట్లాడుతూ.. ఘటన జరిగిన 55 రోజులకు దిశ చట్టం కింద కేసు నమోదు చేయమనడం ఎంత వరుకు న్యాయం? ఆలా చేయమనడమే కాకుండా.. దిశ చట్టం అమలు కాకుండా పోలీసుస్టేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటూ టిడిపి నేతలు ప్రశ్నించడం రాజకీయ దురుద్దేశంతో కూడిందని ఆమె వ్యాఖ్యానించారు. 

 

టిడిపి నేతలు కావాలనే ఈ విషయం పై గొడవలు చేస్తున్నారని.. గందరగోళ పరిస్థితులను నెలకొనేలా చేస్తున్నారు అని.. ఇలా టీడీపీ నేతలు చేసే పనులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై న్యాయ సలహా తీసుకుంటామని ఎస్పీ లతా మాధురి తెలిపారు. ప్రస్తుతం ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: