రాజకీయ నాయకులు అంటే రాబంధులతో సమానం అనే అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. రాజకీయం చేసే వారు అవినీతికి దత్తపుత్రులని అనుకోని వారుండరు.. ఇకపోతే సమాజంలో మానవత్వం పూర్తిగా నశించింది.. ఎవరికి వారు స్వార్ధంతో బ్రతకడం, పక్కవారు, ఎదుటివారు ఏమైపోతే నాకేంటి అనే ధోరణిలో ముందుకు సాగడం చూస్తూనే ఉన్నాం.. ఇక ముఖ్యంగా రాజకీయ నాయకులైతే వారికి అవసరం ఉంటే ప్రజల గడప తొక్కుతారు. అది కూడా ఒక ఎలక్షన్స్ సమయంలో మాత్రమే. అది తీరాక వారు గెలిచాక అసలు ప్రజా అవసరాలు పట్టించుకునే వారే ఉండరు..

 

 

ఒక వేళ ప్రజలకు మంచి చేసే వారు ఎవరైనా ఉన్నారంటే, అది అరకొర మాత్రమే .. ఇలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చూ.. పూర్తిగా సమాజమే ఇలా మారింది. కల్లబొల్లి మాటలు చెప్పే గుంటనక్కలు ఉన్న ఈ సమాజంలో మాత్రం ఒక ఎమ్మెల్యే మానవత్వంతో ప్రవర్తించి తన మనసును చాటుకున్నాడు.. ఆ వివరాలు తెలుసుకుంటే ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడ అనే గ్రామంలో, నెలలు నిండిన జెమ బెహర అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో అంబులెన్స్‌ రాలేని పరిస్థితి.

 

 

ఈ విషయం తెలుసుకున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి, మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. ఇకపోతే తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేను చూసిన గ్రామస్తులు ఇలాంటి ఎమ్మెల్యే తమ మధ్య ఉండటం నిజంగా తమ అదృష్టం అని పొగుడుతున్నారు..

 

 

నిజానికి ఎమ్మెల్యే అంటే అధికారం చలాయించడం. అభివృద్ది చేయమని ఇచ్చే ధనం అంతా గోనె సంచుల్లో నింపడం చేస్తున్న నేటికాలం నాయకుల మధ్య ఇలాంటి నాయకులు ఉండటం చాలా అరుదు అని చెప్పవచ్చూ.. ఇలాంటి వారిని చూసినప్పుడైనా అవినీతి పరులకు, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఊరేగుతున్న నాయకులకు కాస్తైనా అది వస్తే బాగుంటుందని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: