లోక్ సభలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్న.. యువతకు ఉద్యోగావకాశాలు రావాలన్న ప్రత్యేక హోదా అవసరం అని, విభజన సమయం నాటి హామీల ప్రకారం రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి విన్నవించాం. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని,  బడ్జెట్ లో నిధులు పెంచాల్సిన రంగాల గురించి, ఆంధ్ర రాష్ట్రంలోని పథకాలకు నిధులు కేటాయించాల నే విషయాలపై ప్రసంగించాము.

 

కేంద్రం వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలని..ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనా పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం సరిపోవటం లేదని, దీనికి నిధులు పెంచాలని కోరాను. ఈ పథకం ద్వారా ఇస్తున్న నిధులు సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని అడిగాము. ఆంధ్ర రాష్ట్రంలో రైతుకి రూ.13,500 చొప్పున 46లక్షల మందికి రైతు భరోసాను అందించామని..ఈ పథకానికి నిధులు అందించాలని అడిగాం. 


రైతుల ఆదాయం పెరగాలంటే పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని సూచించాను.  ఉపాధి హామీ పథకానికి గతంలో రూ.81 వేలు కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.61వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ఇచ్చారు. ఇలా కాకుండా ఈ పథకానికి నిధులు గణనీయంగా పెంచాల్సి ఉందని చెప్పాము. అమ్మ ఒడి, నాడు నేడు పథకాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరాను. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాభివృద్ధికి..విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 12 జాతీయ సంస్థలకు త్వరగా నిధులు కేటాయించాలని కోరాను. 

 

ఆంధ్రా జీవనాడి అయిన పోలవరం పూర్తికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరాను. 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనాల్ని త్వరగా ఆమోదించాలని కోరాను.  వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్, 4 స్మార్ట్ నగరాలకు రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని అడిగాము. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, ఇంటిగ్రేటెడ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లకు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని అడిగాము. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రం సర్వతో ముఖాభివృధికి తోడ్పడని కేంద్రాన్ని ఆయన కోరారు .

మరింత సమాచారం తెలుసుకోండి: