దేశ భద్రత ప్రమాదకర పరిస్థితులకు కారకుడై, దేశ ద్రోహానికి పాల్పడిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వర్లు(ఏబీ వి) ను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ chevireddy bhaskar REDDY' target='_blank' title='డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి ఏబీ వెంకటేశ్వర రావు పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. తిరుపతి లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గా చెవిరెడ్డి మాట్లాడుతూ.. విదేశాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నిఘా విభాగం అధికారిగా ఏ బి వెంకటేశ్వర్లు  ప్రమాదకరమైన వస్తువుల కొనుగోలు చేశారని ఆరోపించారు.

 

కేంద్ర  ఐటి, ఈడి విభాగాలు ఏబీ వెంకటేశ్వర రావు పై దాడులు చేసి ఉంటే ఆశ్చర్యచకితులు అయ్యుంటారాన్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి అని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. తెలంగాణ జడ్చర్లలో 53.07 ఎకరాలు, పశువుల గ్రామం 57.59 ఎకరాలు, చిట్వాల లో 64.02 ఎకరాలు ఆయన బరితెగింపు అక్రమాలకు నిదర్శనం అన్నారు. అంతేకాకుండా రైతుబంధు పథకం కింద పాడి పేరుతో రూ.65 లక్షలు తీసుకున్నారన్నారు. బెంగళూరులో రూ.వెయ్యి కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి 100 ఎకరాలు ఉందన్నారు. ఇప్పటివరకు కొన్ని అక్రమాలు వెలుగుచూశాయని వెల్లడించారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన సస్పెండ్ అయితే భయాందోళన గురవుతారు.. ఏబీ వెంకటేశ్వర రావు వంటి తిమింగలాలు భయపడటం లేదన్నారు.

 


పారిశ్రామిక వేత్త గా ఎదిగిన ఆయన సస్పెన్షన్ ను అదృష్టంగా భావిస్తాడని దుయ్యబట్టారు. దేశ రక్షణకు ప్రమాదకరంగా విదేశీ శక్తులతో, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు కలిగిన నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు పై కేంద్రం ఘాటుగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ అంశాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశద్రోహి గా అయనపైన సెక్షన్ 124 ఎ కింద కేసు నమోదు అవుతుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ప్రజల ఎదుట దేశ విద్రోహక శక్తిగా నిలబడతాడని వివరించారు. ఏబీ వెంకటేశ్వరరావు భాగస్వామి అయిన ఘట్టమనేని శ్రీనివాస్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏబీవీ శిష్యుడుగా పేరొందిన డీఎస్పీ రామ్ కుమార్ ఆస్తులు మీడియా సాక్షిగా రూ.200 కోట్లు గా బయట పడ్డాయి అన్నారు. ఏబీవీ విచ్చలవిడి తనానికి, బ్లాక్ మెయిల్ కు, బరితెగింపు న కు సీనియర్, ఐఏఎస్ అధికారులు కూడా ఇబ్బందులు పెట్టి ఏబీవీ రూ.కోట్లకు పడగెత్తారని ఆరోపించారు.

 

ఇటువంటి తప్పుడు పాల్పడే వ్యక్తులను కఠిన శిక్షలు అమలయ్యేలా బాధిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ముందుకొచ్చి వాస్తవాలు తెలియజేయాలన్నారు. మాకెందుకులే అనుకుంటే దేశం మరింత ప్రమాద పరిస్థితులలో కూరుకుపోయిందని విజ్ఞప్తి చేశారు. విజయవాడ జంట హత్య కేసు, ఇసుక రీచ్ లు, చిత్తూరు నుంచి విశాఖ వరకు ఎస్ బి లో తన అనుచరులు ఏర్పాటుతో ఏబీవీ భూ దందాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగు చూస్తుండడంతో ఏబీవీ దేశం వదిలి వెళతారని అనుమానం ఉందన్నారు. కేంద్రం వెంటనే లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలని కోరారు.

 

వ్యక్తిగత కక్షలకు, విద్వేషాలకు తావు లేదని, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు నేడు కీలక స్థానాల్లో పని చేస్తున్నారని గుర్తు చేశారు. కేవలం అం అవినీతి, ఇ అధికార దుర్వినియోగం, దేశరక్షణ కు భంగం కలిగించే అధికారి పట్ల స్పందిస్తామని అన్నారు. సత్ సంకల్పంతో చేపట్టే ఈ యజ్ఞంలో ప్రజలు సంపూర్ణ మద్దతు కావాలన్నారు. ఆధారాలతో బయటపడే ఇటువంటి వ్యక్తులను సమర్ధించ రాదన్నారు. ఒక్క ఒక్కరి ఆర్థిక అభివృద్ధి కోసం విచ్చలవిడితనం తో వ్యవహరించిన వ్యక్తికి శిక్షపడేలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కు ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: