ఈ ప్రపంచంలో ఎవరిపట్ల జాలి, దయ చూపించనిది ఏదైనా ఉందంటే అది ఒక వ్యాధులు మాత్రమే అనిచెప్పవచ్చూ. ఈ రోగాలకు మనుషులు, జంతువులు అనే తేడా ఉండదు. పేదవాడు, ధనికుడు అని అసలే చూడవు.. అంటే ఎలాంటి తారతమ్యం చూడకుండా ప్రతి వారిని పలకరిస్తాయి.. ఇకపోతే ప్రపంచాన్ని నిదురలేకుండా, అందులో చైనాను గజ గజ వణికిస్తున్న వ్యాధి కరోనా.. ఈ వ్యాధికి చైనా ప్రజల జీవన విధానం పూర్తిగా స్దంభించి పోయింది.. ఇప్పుడు అక్కడ బంధాలు, ప్రేమలు చూపించడం కుదరదు. ఎంత ప్రేమున్నా దూరం నుండే పలకరించుకోవడం. అంటే ప్రతి మనిషి అంటరాని వాడుగా మారాడు. అంతటి  మాయదారి కరోనా అక్కడి నుండి ప్రయాణం చేస్తూ, అన్ని దేశాలకు మెల్ల మెల్లగా విస్తరిస్తుంది.

 

 

ఇకపోతే రోగాలకు తారతమ్యాలు ఉండవు గాని వైధ్యం చేసే రోగులను చూసే విధానంలో మాత్రం ఎన్నో బేధాలు. సామాన్యునికి ఒక రకమైన ట్రీట్‌మెంట్.. కాస్త పలుకుబడి ఉన్న వారిని ఒక విధంగా, ఇక వీఐపీలకు మరోరకంగా, మరీ వీవీఐపీలకు రాచమర్యాదలతో వైద్యం అందిస్తున్నారు. ఏమండి అందరికి ఒకేలా రోగం వచ్చినప్పుడు. ట్రీట్‌మెంట్ కూడా ఒకేలా అందించాలి కదా.. మనదేశంలో ఒక నినాదం ఉంది. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. అనే మాటలు చెప్పుకోవడానికి మాత్రమే ఆచరించడానికి కాదని ఎన్నో సందర్భాల్లో నిరూపించ బడుతుంది..

 

 

పుట్టడం తల్లి గర్భంలో నుండే, పోయాక కలవడం మట్టిలోనే మరెందుకు మధ్యలో మనమదరం మనుషులన్న భావన మరవడం.. ఇదిలా ఉంచితే ఇప్పుడు కరోనా అనుమానితుల కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో, ఓ వీఐపీ ఐసోలేషన్ వార్డు సిద్ధమైంది. ఇక్కడ చేరే వారికి టీవీ, ఏసీ, ప్రత్యేక బాత్ రూమ్ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. ఇక వీఐపీ అనుమానితుల సంఖ్య పెరిగితే, వీఐపీ వార్డులను కూడా పెంచుతామని అధికారులు అంటున్నారు. ఇక ఇలా వీఐపీ వార్డులను ఏర్పాటు చేయడానికి కారణం ధన బలం, అధికార బలం ఉన్న ఒక వ్యక్తి కారణమట...

 

 

అదెలా అంటే ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి కుటుంబీకులతో పాటు, చైనా నుంచి వచ్చిన ఎయిర్ హోస్టెస్ లు కరోనా అనుమానంతో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అయితే తొలుత వీరిని కూడా సాధారణ వార్డులో చేర్చగానే, తమ హోదాకు తగ్గ వసతులు లేకపోవడంతో వీరంతా అసంతృప్తిని వ్యక్తం చేశారట. తాము ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని, తమకు మెరుగైన వసతులు కావాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో గాంధీలో ఉన్న పేయింగ్ రూమ్ లను సమస్త సౌకర్యాలతో కరోనా వీఐపీ వార్డులుగా ఏర్పాటు చేశారు... అంతే కదండీ ఈ ప్రపంచం పైసతో నడుస్తుందని అనుకోవడానికి అడుగడుగున కనిపించే ఇలాంటి ఘటనలే  నిదర్శనం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: