ఈనెల 8వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు మొదలైంది. కాగా ఈ కౌంటింగ్ లో నేడు అభ్యర్థుల భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. అయితే దేశం మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అటు ఆప్, బిజెపి పార్టీలు కూడా ఎంతో ఉత్కంఠగా ఫలితాల గురించి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. అయితే మరోసారి ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకొని తమ సత్తా నిరూపించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృఢ సంకల్పంతో ఉంటే.... బిజెపి ఈసారి ఎలాగైనా దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుపై అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఢిల్లీలో తమ సత్తా నిరూపించలేక పోతుంది బిజెపి పార్టీ. 

 

 

 కాగా ఈ ఎన్నికల్లో అయినా గెలవాలి అని  సర్వ ప్రయత్నాలు చేసినది బిజెపి. అయితే ఈ నెల 8న ఎన్నికలు జరగ్గా దీనికి సంబంధించిన కౌంటింగ్ నేడు  జరుగుతుంది. దీంతో దేశం మొత్తం కౌంటింగ్ పైన దృష్టి పెట్టింది. అయితే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని మరోసారి ఢిల్లీలో ఆప్  పార్టీ అధికారంలోకి రాబోతోంది అని స్పష్టంగా తెలియజేసాయి. హస్తినలో  అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పాయి. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ లో కూడా అదే జరుగుతోంది. కేవలం పది నిమిషాల్లోనే ఢిల్లీలో ఫలితం ఏమిటో తెలిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే అత్యధిక స్థానాల్లో మెజారిటీ లో దూసుకుపోతుంది కేజ్రీవాల్ పార్టీ. మరోసారి బిజెపి కి భారీ షాక్ తగిలేటట్లు  కనిపిస్తోంది.. 

 

 గతంలో 2014 2019 ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి సత్తా చాటు లేకపోయింది. ఇక మొన్నటికి మొన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో కూడా కేజ్రీవాల్ ఆప్  పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపినప్పటికీ... ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పని తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది బిజెపి పార్టీ. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను చూస్తుంటే చీపురు పార్టీ బిజెపి పార్టీ ని ఎర్రి పుష్పం చేసి  పూర్తిగా ఊడ్చేసినట్లు కనిపిస్తోంది. తొలి పది నిమిషాలకే ఫలితం కాస్త తేలిపోయినట్లు  అనిపిస్తోంది. కేజ్రివాల్ ఆప్ పార్టీ 40 స్థానాల్లో ముందంజలో ఉంటే... బిజెపి కేవలం పది స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది... కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ ఘోరం గా మారిపోయింది కేవలం ఒక్కటంటే ఒక్కటి స్థానాల్లో ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: