చైనాని పెను సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. వాక్సిన్ లేని ఈ వ్యాధి బారిన పడ్డ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ వైరస్ ని మట్టు పెట్టించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వైరస్ బారిన పడ్డ వారిని వేరు చేసి వారి నుండి మరొకరికి సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రపంచీకరణలో భాగంగా ఈ వైరస్ ప్రపంచ దేశాలకి కూడా పాకుతోంది.

 

 

ఇప్పటి వరకు ఇరవై ఆరు దేశాలకి పాకిన ఈ వైరస్ మరికొన్ని దేశాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ బాఆ దెబ్బతింది. చైనా నుండి దిగుమతులన్నింటినీ ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలని చైనా నుండి దిగుమతి చేసుకునే దేశాలన్నీ కరోనా ప్రభావం వల్ల ఆ దిగుమతులని ఆపేశాయి. దీనివల్ల చైనా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. అయితే ఈ ప్రభావం ఒక్క చైనా మీదే కాదు ప్రపంచ దేశాల మీద కూడా ఉంది.

 

 


తాజాగా ఈ కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. తైవాన్ లో కరోనా వ్యాధిగ్రస్తులని కనుగొన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఒకరిని మరొకరికి సోకకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలని తీసుకుంటుంది. దానిలో భాగంగానే అక్కడ సినిమాల్లో గానీ, సీరియళ్లలో గానీ ముద్దు సీన్లను నిషేధించారు. నోటిలో ఉండే లాలాజలం, చర్మం నుండి వచ్చే చెమట వల్ల ఈ వైరస్ ఇతరులకి సోకే ప్రమాదం ఉన్నందున ఈ సీన్లను కట్ చేసారు.

 

ప్రస్తుతం తైవాన్ సినిమాల్లో ముద్దు సీన్లు ఉండకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పాస్  చేసారట. చైనా నుండి ఇప్పటి వరకు నాలుగు వందల మందిని తైవాన్ తరలించారు. అందులో ఒకరికి కరోనా వైరస్ ఉందని తెలిసింది. మరొకరికి ఆ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. వారందరినీ వేరు చేసి మిగతా వారికి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: