ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఫలితాల కౌంటింగ్ మొదటి రౌండ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందనే ప్రకటనలతో ఈ రోజు సీఎం క్రేజీవాల్ ఇంటి వద్ద, ఆమ్ ఆద్మీ పార్టీ ఆపీసు వద్ద సందడి వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలు మొదటి నుంచి ఉత్కంఠభరితంగానే సాగింది. ఈ ఎన్నికలు అధికార పార్టీ బిజెపికి ప్రతిష్టాత్మకం కావడంతో ఇక్కడ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నించింది.  అయితే గత ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రజల్లో ఆ పార్టీకి ఎక్కువ ఆదరణ లభించింది.


 బిజెపి ఇక్కడ ఓటర్లకు ఎన్ని వరాలు కురిపించిన ఫలితాలు మాత్రం ఆమ్ ఆద్మీ వైపు నిలిచేలా కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మహిళలతో సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం ఏమిటి అనేది మరికొద్ది సేపట్లో తేల బోతోంది. అభివృద్ధి అజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే విజయం అని మొదటి నుంచి చెబుతూనే వస్తోంది. ఇక జాతీయవాదం సీఐఐ వ్యతిరేకత ఆందోళన పై తీవ్రంగా ప్రచారం చేసిన బిజెపి కూడా తమకి ఢిల్లీ ప్రజలు పట్టం కడతారని ఆశలు పెట్టుకుంది.


 ఈరోజు ఫలితాలను బట్టి బిజెపి భవితవ్యం తేలనుంది.అందుకే ఉత్కంఠభరితంగా ఫలితాలకోసం బిజెపి చూస్తోంది. ఎన్నికల ఫలితాలు మొదటి మొదటి రౌండ్లోనే ఆప్ పార్టీకి ఆధిక్యం దక్కడంతో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం వారి నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఢిల్లీలో  బీజేపీ పై ఆప్ వైపే ఓటర్లు ఉన్నా వారంతా మోదీ ప్రధానిగా సమర్థవంతంగా పనిచేస్తున్నాడనే భావిస్తున్నాయి. కాకపోతే బీజేపీ వద్దు మోదీ ముద్దు అన్నట్టుగా ఢిల్లీ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనే అంచనాలో అందరూ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: