దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి  ఓట్ల లెక్కింపు పర్వం మొదలైంది. దేశం మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు వివిధ పార్టీలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ బిజెపి పార్టీ అయితే ఈ ఎన్నికలను ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే రెండుసార్లు హస్తినలో  అధికారాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కి భారీ షాకిచ్చిన కేజ్రీవాల్ చీపురు పార్టీ... మరోసారి బీజేపీకి షాక్ ఇవ్వాలని బరిలోకి దిగగా... ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి బరిలోకి దిగింది. 

 


 కాగా ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కేజ్రీవాల్ పంతం నెగ్గించుకున్నట్లు  కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలలో హస్తిన ఓటర్ల అందరూ మోదీ వద్దు కేజ్రీవాల్ ముద్దు అని కేజ్రివాల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కేవలం ఓట్ల లెక్కింపు మొదలైన పది నిమిషాల్లోనే ఫలితం ఏమిటో తేలిపోయింది. గతంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కేజ్రీవాల్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకొని 100 స్పీడ్ తో దూసుకుపోతుంది. ఢిల్లీ వీధుల్లో కమలం పార్టీని పూర్తిగా ఊడ్చి  చెత్త బుట్టలో పడేసింది. మరోసారి బీజేపీ పార్టీ ఢిల్లీలో సత్తా చాట లేకపోయింది అని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడితే మాత్రం ఏమిచేయగలరు చివరికి ప్రజల నిర్ణయమే తుది తీర్పు అని మరోసారి వెల్లడైంది. 

 


 కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీని... దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్ ఆప్ పార్టీ చిత్తుగా ఓడించింది అనే చెప్పాలి. కేవలం ఓట్ల లెక్కింపు మొదలైన పది నిమిషాల్లోనే మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది ఆప్ పార్టీ . ఇక బిజెపి పార్టీ అయితే కనీసం మెజారిటీ స్థానాలను కూడా గెలవలేక పోతున్నట్లు  తెలుస్తోంది. కేజ్రీవాల్ ఆప్  పార్టీ 50 స్థానాల్లో ముందంజలో ఉండగా... కేంద్రంలో చక్రం తిప్పుతున్న బిజెపి పార్టీ మాత్రం... హస్తినలో చతికిలబడి కేవలం 16 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: