దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ... బిజెపి పార్టీ ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బిజెపి కి భారీ షాక్ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం బిజెపి ఎట్టి పరిస్థితుల్లో హస్తినలో అధికారాన్ని దక్కించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసింది. కానీ బిజెపి పార్టీ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హస్తిన ప్రజలు మాత్రం ఆప్ పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నేడు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. 

 

 ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ప్రస్తుతం ఆప్ పార్టీ ఎక్కువ స్థానాల్లో మెజారిటీతో కొనసాగుతోంది. కాగా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి కావడంతో ఎలక్ట్రానిక్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు. కాగా తొలి పదిహేను నిమిషాల్లోనే 50 స్థానాల్లో మెజారిటీని సాధించి దూసుకుపోతుంది ఆప్  పార్టీ. ఈ నేపథ్యంలో మరోసారి కేజ్రీవాల్ అధికారాన్ని దక్కించుకొని.. బీజేపీ కి భారీ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేజ్రీవాల్ పార్టీ 50 స్థానాల్లో ముందంజలో ఉండగా బిజెపి కేవలం 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ చీపురు పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో మెజారిటీ లో కొనసాగుతోంది. 

 


 ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీని ఢిల్లీ వీధుల్లో మాత్రం చీపురు పార్టీ కమలం పువ్వులను పూర్తి ఊడ్చేసినట్లు తెలుస్తోంది. కనీసం కాస్తయినా మెజారిటీ అందించకుండా పూర్తిగా ఊడ్చేసింది  కేజ్రివాల్ చీపురు పార్టీ. ఈ నేపథ్యంలో మరోసారి కనీసం అధికారాన్ని దక్కించుకోవాలి అని బిజెపి పార్టీకి ఆలోచన కూడా రాకుండా మరోసారి సత్తా చాటింది కేజ్రీవాల్ పార్టీ. ఎగ్జిట్ పోల్స్ తప్పు అంటూ బీజేపీ నేతలు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. ప్రజలు బీజేపీని ఎర్రి పుష్పం చేశారు అని చెప్పాలి. ఆప్ పార్టీ ముందు బిజెపి నిలువలేక చతికిలబడి పోగా... చీపురు పార్టీ బీజేపీ పార్టీని ఊడ్చి  చెత్త బుట్టలో పడేసినది.

మరింత సమాచారం తెలుసుకోండి: