ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో విజయం వైపుగా క్రేజివాల్ పార్టీ దూసుకుపోతోంది. బిజెపి ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలంతా క్రేజీ వాల్ చేసిన అభివృద్ధిని చూసి ఆ పార్టీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ప్రజాసంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయడం, సాంప్రదాయ రాజకీయ పార్టీల కంటే ఆప్ సమర్థవంతంగా పని చేస్తుందనే నమ్మకం తో మరోసారి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. తొలి రౌండు కౌంటింగ్ పూర్తి చేసే సమయానికి ఆప్ పార్టీకి 54 స్థానాలు బిజెపి 15 స్థానాలు కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆధ్మీ పార్టీ అభ్యర్థులు 50 కి పైగా  స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండడం బీజేపీకి కలవరం పుట్టిస్తోంది.


 ఢిల్లీ నియోజకవర్గంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీప ప్రత్యర్థికంటే ముందంజలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను అధికారులు లెక్కిస్తున్నారు . 22 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు బిజెపి గట్టిగానే ప్రయత్నించింది. కాంగ్రెస్ కు  కంచుకోటగా ఉన్న ఢిల్లీలో ఆప్ పార్టీ ఇప్పుడు తనకు కంచుకోటగా మార్చుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కి ఢిల్లీ పీఠం ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ప్రజలు మాత్రం గతంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ చేసిన అభివృద్ధిని మరోసారి కోరుకుంటున్నట్లుగా ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టి అర్థమవుతోంది. 


ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వానికి కి మరోసారి అధికారం ఖాయం అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించడంతో దాదాపుగా ఆ పార్టీ  విజయం ఖాయం అయిపోయిందని అంతా అప్పుడే డిసైడ్ అయిపోయారు. ఇక మొదటి స్థానంలో ఆమ్ ఆద్మీ, రెండో స్థానంలో బిజెపి, ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉండేలా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను బట్టి అర్థమవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: