ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కీలక మలుపులు తీసుకుంటోంది. రాజకీయంగా కూడా అగ్గి రాజేసిన ఈ అంశంలో టీడీపీ పార్టీ నుంచి ఆయనకు సానుభూతి వస్తోంది. ఏబీ సస్పెన్షన్ వ్యవహారంలో ఆయన కుమారుడు ఎ.చేతన్ సాయికృష్ణ వ్యవహారం కూడా కీలకంగా మారింది. భద్రతా పరికరాల కొనుగోలులో చేతన్ బిడ్ దాఖలు చేసి అవకతవకలకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. దీనిపై ఆయన స్పందన..

 

 

‘అమెరికాలో ఇంజినీరింగ్ పూర్తిచేసి అక్కడే మూడేళ్లు ఉద్యోగం చేసి బారత్‌లో స్థిరపడాలని 2017 ఏప్రిల్ లో వచ్చాను. ఔత్సాహిక వ్యాపారవేత్తగా ఎదగాలని ఏపీ కొత్త రాష్ట్రమైనా మే 2017లో విజయవాడలో స్టార్టప్ ను ప్రారంభించాను. 2019 అక్టోబర్ వరకు వేరే స్టార్టప్స్ కూడా ప్రారంభించా. మరికొన్ని స్టార్టప్ సంస్థల్లో కూడా భాగస్వామిగా ఉన్నాను. ఇవేవీ షెల్ కంపెనీలు కావు. అర్హత ఉన్న కంపెనీలన్నింటికి రిటర్న్‌లు దాఖలు చేశా. నేను ఏ ప్రభుత్వంతోగానీ, ఏ ప్రభుత్వ శాఖతోగానీ ఒప్పందం చేసుకోలేదు. ప్రభుత్వం ప్రకటించిన ఏ టెండర్ లోనూ పాల్గొనలేదు. కేవలం ప్రైవేటు రంగంలోనే వ్యాపారం చేశాను. నా తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని వ్యాపారం చేయలేదు.. లాభం పొంద లేదు. నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో సమాధానం ఇచ్చేందుకు పరిమితులున్నాయి. అందుకే నేనే ఈ విషయాలు వెల్లడిస్తున్నాను. ఇప్పటికైనా నా పేరు బజారుకు లాగడం ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తా’ అని ప్రకటన ఇచ్చాడు.

 

 

అయితే ఈ అంశంలో విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నామని పోలీసు శాఖ అంటోంది. కానీ.. ఏబీకి టీడీపీ నేతలు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. గతంలో టీడీపీకి అనుబంధంగా పనిచేశార్న ఆరోపణలనూ ఏబీ ఎదుర్కొన్నారు. ఈ అంశం మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: