నిన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఢిల్లీ ఫలితాలు ఈ రోజు మొదలయ్యాయి.  మొదటి నుంచి ఇక్కడ బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. కాంగ్రెస్ పరిస్థితి కొంత కాలంగా ఢీలాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఢీల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్ షతవిధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ప్రస్తుతం ఢిల్లీ సీఎం గా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఢిల్లీలో అధికార పీఠం ఎవరిదో మరికొన్ని గంటల వ్యవధిలో తేలిపోనుంది. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనావేస్తుండగా...అనూహ్య విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. పటిష్టబందోబస్తు ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గం.ల నుంచి కౌంటింగ్ మొదలైంది.

 

ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరికాసేపట్లో వారి భవితవ్యం తేలిపోనుంది. రెండు గంటల వ్యవధిలోనే అధికారం ఎవరిదో క్లారిటీ రానుంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు.  మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఇవాళ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కాగా,  కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

 

 ఇదిలా ఉంటే.. తొలి రౌండప్ కౌంటింగ్ పూర్తియ్యేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాలు, బీజేపీ 15 స్థానాలు, కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నారు. కాగా, మరోసారి ఈవీఎంల అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతోంది. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది.  మరోసారి ఢిల్లీ షహన్ షా కేజ్రీవాలే అని అంటున్నారు అక్కడి పార్టీ సభ్యులు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారో తెలిసిపోతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: