అమిత్ షా... మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు. ఆయన వ్యూహం పన్నితే ఎలాంటి పనైనా జరిగిపోవాలి. ఆయన వ్యూహాలతోనే బీజేపీకి అనేక విజయాలు సాధించి పెట్టారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడంలో అమిత్ షానే కీలక పాత్ర పోషించారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ రకంగా బీజేపీని మోదీ ముందుండే నడిపిస్తే...షా వెనుక ఉండి చక్రం తిప్పుతారు. అయితే ఈ విధంగా బీజేపీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న అమిత్ షా వ్యూహాలు ఈ మధ్య పెద్ద వర్కౌట్ కావడం లేదు.

 

ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టం కాగా, తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా అర్ధమైపోయింది. ఆయన వ్యూహాలతో పాటు, ప్రచారాలు కూడా పెద్దగా జనాలకు ఎక్కలేదని క్లారిటీ వచ్చేసింది. అమిత్ షా...దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఓడినా పర్లేదు...ఢిల్లీలో మాత్రం ఓడకూడదని చాలా కష్టపడ్డారు.

 

దేశరాజధానిలో ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన కంకణం కట్టుకుని తిరిగారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక్క ఢిల్లీలోనే ఏకంగా 50 రోడ్ షోలు నిర్వహించారు.  ఢిల్లీలోని ప్రతి గడప తొక్కి ఓట్లు అడిగారు. ఇంటింటికి వెళ్ళి బీజేపీకి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలని ప్రాధేయపడ్డారు. అసలు ఓ కేంద్ర హోంమంత్రి ఇలా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. 

 

అటు అరవింద్ కేజ్రీవాల్ పై స్థాయి దాటి విమర్శలు చేశారు. వీలు దొరికినప్పుడల్లా అనవసరపు విమర్శలు చాలానే చేసేశారు. ఇక దాదాపు 240మంది బీజేపీ ఎంపీలు,70మంది కేంద్రమంత్రులు ఢిల్లీలో ప్రచారంలోకి దించారు.  ఎంపీలందరూ ఢిల్లీలోని స్లమ్ లలో పర్యటించి రాత్రుల్లు అక్కడే భోజనం, బస చేసి మరి ప్రచారం చేశారు. అయితే అమిత్ షా తన స్థాయిని తగ్గించుకుని ఎంత ఇంటింటి ప్రచారం చేసిన, ఢిల్లీ ఓటర్లు మాత్రం కేజ్రీవాల్‌కే పట్టం కట్టారు. చీపురు అయితేనే బాగా పని చేస్తుందని చెప్పి కమలాన్ని పక్కన బెట్టేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: