అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి చుక్కులు చూపించారు.  మోడికి చుక్కులు చూపించిన ఘనతను అరవింద్ ఒక్కడే దక్కించుకున్నాడు. ఎందుకంటే బిజెపి తరపున నరేంద్రమోడి, అమిత్ షా లు విస్తృతంగా ప్రచారం చేశారు. వీళ్ళిద్దరూ స్టార్ క్యాంపెయినర్లుగా జనాల్లోకి వెళితే క్షేత్రస్ధాయిలో దాదాపు 200 ఎంపిలను రంగంలోకి దింపారు.  అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిలకు బాధ్యతలను అప్పగించి మోడి కేజ్రీవాల్ ను దెబ్బ కొట్టేందుకు చాలా పెద్ద ఎత్తున రచించిన వ్యూహాలను కేజ్రీవాల్ బద్దలు కొట్టారు.

 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున  మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక్కడే ప్రచార బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  మోడి, అమిత్ లు బిజెపి తరపున ఎంత స్ధాయిలో కష్టపడ్డారో కేజ్రీవాల్ ఒక్కడే ఆప్ తరపున కష్టపడ్డారు. మోడి, అమిత్ ఎన్నికల మ్యానేజ్ మెంట్ ఎలాగుంటుందో జనాలందరూ ఇప్పటికే  చాలా రాష్ట్రాల్లో చూశారు. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా కేజ్రీవాల్ ముందు అవేవీ  పని చేయలేదు. తాజా వార్తల ప్రకారం ఆప్ 55 సీట్లలో మెజారిటితో దూసుకుపోతోంది.

 

గడచిన ఐదేళ్ళల్లో కేజ్రీవాల్ ను  మోడి ఎంతగా ఇబ్బంది పెట్టారో జనాలకు ఇంకా గుర్తుంది. దానికితోడు ముఖ్యమంత్రి మీద క్లీన్ ఇమేజి ఉంది. సంక్షేమ పథకాలైన విద్య, వైద్యం, కనీసవసరమైన మంచినీటి సరఫరా, 200 యూనిట్ల ఉచిత  విద్యుత్ లాంటి అనేక కార్యక్రమాలతో  కేజ్రీవాల్ జనాలకు బాగా దగ్గరయ్యారు. మహిళలకు ఢిల్లీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వారికోసం ప్రత్యేక బస్సులు నడపటం లాంటి చర్యలతో మహిళల మద్దతును పెంచుకున్నారు.

 

అదే సమయంలో  క్షేత్రస్ధాయిలో జనాల అవసరాలను గమనించకుండా మోడి మాత్రం జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, పౌర సవరణ జాబితా, పౌర జనన పట్టిక లాంటి వివాదస్పద అంశాలను మాత్రమే తమ ప్రచారంలో ప్రస్తావించారు. దాంతో జాతీయ అంశాలతో జనాలు కనెక్ట్ కాలేదు.  తమకు అందుబాటులో ఉంటూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న మిస్ట్ర్ క్లీన్ అరవింద్ కేజ్రీవాల్ నే మళ్ళీ గెలిపించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: