అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం వైపు దూసుకుపోతోంది. మొత్తం 70  స్ధానాలున్న అసెంబ్లీలో ఆప్ ప్రస్తుతానికి 49 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీలతో ముందంజలో ఉంది.   బిజెపిలో 21 సీట్లలో మెజారిటితో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కస్ధానంలో కూడా మెజారిటి సాధించలేకపోతోంది. సరే అంతిమ ఫలితం ఎలాగుంటుందన్నది వేరే సంగతి. పోయిన ఎన్నికల్లో  ఆప్ కు 67 సీట్లు వస్తే బిజెపి కేవలం 3 నియోజకవర్గాలకు  మాత్రమే  పరిమితమైపోయింది.

 

తాజా ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో వచ్చినంత మెజారిటి వస్తుందా రాదా అన్నది అనుమానంగా ఉంది. అయితే బంపర్  మెజారిటి తగ్గినా  మంచి మెజారిటితో ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని తెలిసిపోతోంది. ఇక కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించటం అంటే మామూలు విషయం కాదు. అదికూడా నరేంద్రమోడి, అమిత్ షా ను మట్టి  కరిపించి ఘన విజయం సాధించటం గమనార్హం.

 

కేజ్రీవాల్ ఇంతటి ఘన విజయం సాధించటానికి కారణాలున్నాయి. మోడిని కాదని జనాలు కేజ్రీవాల్ కు పట్టం కట్టారంటేనే కారణాలు అనేకం ఉన్నట్లు స్పష్టమైపోతంది. ఇంతకీ అవేమిటంటే అభివృద్ధి-సంక్షేమ పథకాలను చక్కగా బ్యాలెన్స్  చేయటమే. అదే సమయంలో  కేజ్రీవాల్ ను కేంద్రప్రభుత్వం ఎంతగా వేధించింది కూడా జనాలు మరచిపోలేదు.  కేజ్రీవాల్ సిఎం కాకముందు ఢిల్లీ జనాలకు మంచినీటి సరఫరా అందటం దైవాదీనం. అధికారంలోకి రాగానే ముందుగా కేజ్రీవాల్ మంచినీటి సరఫరా మీద దృష్టి పెట్టారు. ఢిల్లీ మొత్తానికి మంచినీటి సరఫరా చేస్తున్నారు. దాంతో జనాలు ఫిదా అయిపోయారు.

 

అలాగే మధ్య, దిగువ తరగతితో పాటు పేదలకు కూడా నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించారు. మురికివాడల్లోని పేదల పిల్లలు చదువుకోవటానికి మంచి స్కూళ్ళు ఏర్పాటు చేశారు.  పేదలకు ఉచిత విద్యను అందించారు. అర్హులైన పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించారు. అదే సమయంలో మహిళలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం అందించారు. అదే సమయంలో కేజ్రీవాల్ మీద మిస్టర్ క్లీన్ ఇమేజి ఉండటంతో జనాలు ఆప్ కు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: