వారం రోజుల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవ్వగా... కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా... నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ మాత్రం కేవలం 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ సరిపెట్టుకుంది. కాంగ్రెసు, ఇతర పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

 

 

ఇకపోతే ఒక మాట చెప్పుకోవాలంటే ప్రతి ఎన్నిక‌ల్లో జాతీయ‌వాదం, దేశ‌భ‌క్తిని రెచ్చ‌గొట్టేలా ప్లాన్‌ చేసే భాజపా పార్టీ యొక్క వ్యూహం ఈసారి అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. గుజ‌రాత్‌లో కూడా ఇదే ప్లాన్‌, అలాగే జార్ఖండ్ ఎన్నిక‌ల్లో, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా అదే మంత్రాన్ని పాటించిన మోడీ పార్టీ అక్కడి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెంది అభాసుపాలు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఫలితాలు వెలువడుతున్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆ సొల్లు పురాణాన్ని ప్రయోగించినా... జ‌నాలు మాత్రం అస్సలు ప‌ట్టించుకోలేదు. త‌మ‌కు దేశ‌భ‌క్తి, జాతీయ‌వాదం ఉన్నాయన్న సందేశాన్ని ఢిల్లీ ఎన్నికల ద్వారా బలంగా ప్రజలు ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఎన్నికలు చూస్తుంటే దేశం బీజేపీ సొత్తు కాదు అంద‌రిది అని ఫ్రూవ్ చేశాయని స్పష్టమవుతుంది.

 


రాజకీయ విశ్లేషకుల ప్రకారం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ బిల్లులను మోడీ ప్రవేశ పెట్టడం వలన జనాలంతా భాజపా పార్టీకి వ్యతిరేకంగా మారారని.. అందుకే బీజేపీ పార్టీ పట్ల తమ అసహనాన్ని, వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెబుతున్నారు. షహీన్‌బాగ్, జమియా మిలియా ఇస్లామియా వర్సిటీలో జరిగిన నిరసనలు కూడా ఓ రకంగా బిజెపి పార్టీ ఘోర పరాజయానికి కారణమని తెలుస్తోంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో పోలింగ్ శాతం 2015 సంవత్సరంలో కంటే అత్యధికంగా పెరిగిందని తెలుస్తోంది. వీరంతా బిజెపి పార్టీకి వ్యతిరేకత చూపి.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం... వారు విద్యా, ప్రజా, ఆరోగ్య రంగాలలో కేజ్రీవాల్ ప్రభుత్వం మంచి పాలన అందించడంతో చాలామంది ఆప్ పార్టీ వైపే మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: