దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన  మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో ఆప్  పార్టీ బీజేపీని చిత్తుగా ఓడించింది. మొదటినుంచి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో మెజారిటీ సాధించి దూసుకుపోతోంది కేజ్రీవాల్ పార్టీ. గత రెండు అసెంబ్లీ ఎలక్షన్ ల నుంచి బిజెపి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... హస్తిన ప్రజలు మాత్రం కేవలం కేజ్రీవాల్ పై నమ్మకం ఉంచి ఆప్ పార్టీ కి పట్టం కడుతున్నారు. ఇక ఈ సారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ... ప్రస్తుతం కేజ్రీవాల్ పైన నమ్మకం ఉంచారు. మరోసారి కేజ్రీవాల్ కే పట్టంకట్టి  భారీ మెజార్టీ అందించారు. 

 


 అయితే కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని పాలో  అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో  ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి పాలన సాగించాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాగా ఈ విషయాన్ని ఆప్ వాళ్లు కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చివరి ఏడాది పూర్తిగా ఢిల్లీ  ముఖ్యమంత్రి కేజ్రివాల్  సంక్షేమ పథకాల పైన దృష్టి పెడుతూ వెళ్లారు.అన్ని  వర్గాల ప్రజలకు  సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జగన్ బాటలోనే నడిచాడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. 

 


 ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేజ్రీవాల్ హ్యాట్రిక్ గెలుపుకు కారణమయ్యాయని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేజ్రీవాల్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో హస్తిన ప్రజలందరూ ఎంతో సంతృప్తి చెందారని... అందుకే బిజెపికి చిత్తుగా ఓడిస్తు  కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎక్కువ మెజారిటీ కట్టబెట్టారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అంతేకాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గెలుపు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ స్పిరేషన్ ఉంది అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఢిల్లీలో ఆప్  పార్టీ సంచలన మెజారిటీ సొంతం చేసుకుని మరోసారి ఢిల్లీలో బిజెపి చిత్తు  చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: