కరోనా.. ఇప్పటి వరకూ చైనానే వణికించిన ఈ వైరస్ గురించిన ఈ వార్త ఇప్పుడు ప్రపంచాన్ని కూడా వణికిస్తోంది. ఎందుకంటే.. కరోనా మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ వందల్లో ఉన్న మృతుల సంఖ్య.. ఇప్పుడు వేలకు చేరింది. చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

 

 

మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 1016కు చేరింది. అంతే కాదు.. మరో 50 వేల మందికి ఈ వైరస్ సోకింది. రోజుకు కనీసం వంద మంది వరకూ చైనాలో చనిపోతున్నారు. అయితే ఇవన్నీ అధికారికంగా వెలువడిస్తున్న లెక్కలు. ఇక అనధికారికంగా ఇంకెన్ని మరణాలు ఉన్నాయో అన్న భయం ఇప్పుడు ప్రపంచాన్ని దడదడలాడిస్తోంది.

 

 

ఎందుకంటే.. కరోనా గురించి పెద్దగా అవగాహన లేని సమయంలో చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లినవారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వారి కారణంగా ఈ వైరస్ ప్రపంచానికి పాకుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. చైనా లో రోజూ కనీసం 3000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. చివరకు చైనా ప్రజల్లో ధీమా నింపేందుకు చైనా అధ్యక్షుడే రంగంలోకి దిగారు.

 

 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముఖానికి మాస్క్‌ ధరించి సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. ఓ ఆరోగ్య శిబిరం వద్ద కరోనా వైరస్‌పై సన్నద్ధతను తొలిసారి స్వయంగా పర్యవేక్షించారు.

 

ఆయన కూడా స్వయంగా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. హుబెయ్‌ ప్రావిన్సు ప్రజలకు సంఘీభావంగా యావత్‌ చైనా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇలా కరోనా విషయంలో జిన్‌పింగ్‌ క్షేత్రస్థాయికి రావడం ఇదే ఫస్ట్ టైమ్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: