ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అందరూ ఊహించినట్టుగానే అధికార ఆమ్‌ ఆధ్మీ పార్టీ మరోసారి జయకేతనం ఎగురవేస్తోంది. ప్రధాని సహా సర్వశక్తులు ఒడ్డి పోరాడిన బీజేపీ ఈ సారి పరువు నిలుపుకున్నా అధికారం మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ప్రచారం విషయంలో జాతీయ లాంటి అంశాలను తెర మీదకు తీసుకువచ్చిన కమలనాధులు, కేజ్రీవాల్ ప్రభంజనాన్ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయారు.


గత ఎన్నికల్లో ఖాతా తెరవకుండానే ఓడిపోయిన బీజేపీ ఈ సారి కాస్త గట్టి పోటినే ఇచ్చిందని చెప్పాలి. ఎన్నికలకు ముందుకు గెలుపు అవకాశాలు కూడా కూడా ఉన్నట్టుగానే కనిపించినా ప్రచారంలో చేసిన పోరపాట్లే కమలం పార్టీ కొంపముంచింది. ముఖ్యంగా షహీన్‌ బాగ్‌ అల్లర్లు ఆప్‌ పనే అంటూ బీజేపీ చేసిన ఆరోపణలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. మిస్టర్‌ క్లీన్ ముద్ర ఉన్న కేజ్రీ సర్కార్‌పై బీజేపీ చేసిన ఆరోపణలు బూమరాంగ్‌లా రివర్స్‌ అయ్యాయి. దీంతో దాదాపు 15 స్థానాల్లో బీజేపీ ఓటమి ఆ ఒక్క ఆరోపణే కారణమైంది.


షహీన్‌ బాబు అల్లర్ల విషయంలో బీజేపీ తీవ్ర ఆరోపణలే చేసింది. మఖ్యంగా ఆప్‌ కార్యకర్తలు దొంగలు, హంతకులు, దుర్మార్గులు అంటే బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఆ పార్టీ మీదే వ్యతిరేకతకు కారణమైంది. దీంతో కమలం పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ కాస్త మెరుగైందనే చెప్పాలి. ఎక్కవ స్థానాల్లో విజయం సాదించలేకపోయినా బీజేపీకి ఓటు శాతం మాత్రం ఘననీయంగా పెరిగింది.


అభివృద్ధి మంత్రమే ప్రధానాస్త్రతంగా ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ తొలి రోజు నుంచే దూకుడు చూపించాడు. బీజేపీపై విమర్శలు సంధిస్తూనే తన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విజయం సాధించాడు. కౌంటిగ్ ప్రారంభమైన దగ్గరనుంచే ముందంజలో ఉన్న కేజ్రీవాల్‌ ప్రతీ రౌండ్‌లోనూ తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే ఫలితాలపై క్లారిటీ వచ్చేయటంతో ఆప్‌ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: