ఒక పిల్లాడికి గ్లాస్ పాలు, ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి తినమని చెపితే ఏడుస్తున్నాడు. అతని తల్లి వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే, మరేమో ఈ బ్రెడ్ నా పాలు అన్ని తాగేస్తుంది. అని అమాయకంగా ముఖం పెట్టి కంప్లేంట్ చేశాడు.. దానికి ఆ తల్లి నవ్వి, ఆ పాలు బ్రెడ్ తాగితే దాన్ని నువ్వు తింటున్నావు కదరా అని అసమాధానం చెబుతుంది. ఆ మాటలకు అర్ధం తెలియని అతను అమాయకంగా ముఖం పెట్టి తలాడించాడు..

 

 

ఇకపోతే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఇలానే సాగుతున్నాయని కొందరు అనుకుంటున్నారట.. ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని గాలిలో మేడలు నిర్మించి, ఏది చేయకుండా మీద మీద మెరుపులు మెరిపిస్తూ, ప్రజలను అమాయకులను చేస్తున్నారని అనుకుంటున్నారట కొందరు.. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తే లోకం అందరికి తెలుసు తెలంగాణా బాగుపడుతుందా, అప్పుల తెలంగాణలా మారుతుందా అనే విషయం పక్కన పెడితే చిన్న సహయం చేస్తేనే సంతోషించే అల్పసంతోషిలుగా చెప్పబడుతున్న పేద ప్రజలే ప్రతి రాజకీయ నాయకుని టార్గెట్..

 

 

పది రూపాయల సహాయం చేస్తే పది కాలాల పాటు గుర్తుంచుకునే మనస్తత్వం పేదలది. ఈ విషయం తెలిసిన, ఏపీ సర్కార్ కానీ, తెలంగాణ సర్కార్ గానీ పేదల కోసం పధకాలను ప్రవేశ పెడుతున్నాయి.. అవి ఎంతవరకు వారికి అందుతున్నాయో అనే విషయం పక్కనపెడితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ మరో పధకాన్ని ప్రవేశపెట్టబోతుంది.. అదేమంటే పేదలకు రూ. 5కే భోజనాన్ని అందిస్తున్న క్యాంటీన్లు, ప్రస్తుతం ఓ డబ్బా మాదిరిగా వుండడంతో అక్కడే జనం నిలబడి భోజనం చేస్తున్న సంగతి తెలిసిందే..

 

 

అందుకే వీటి రూపురేఖలను మార్చాలని, పేదలు కూర్చుని కడుపునిండా తినే పరిస్థితి కల్పించాలని నిర్ణయానికి వచ్చారట.. ఇందుకు గాను అన్నపూర్ణ క్యాంటీన్ల విస్తీర్ణాన్ని పెంచుతూ, డైనింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు, ముందుగా ఎల్బీ నగర్ చౌరస్తాలోని అన్నపూర్ణ క్యాంటీన్ ను మార్చారు. మరో 20 రోజుల్లో అన్ని హంగులతో ఈ సెంటర్ లో 35 మంది కూర్చుని తినేలా సదుపాయాలను కల్పిస్తామని తెలుపుతున్నారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన అన్ని క్యాంటీన్లను ఆధునికీకరించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.. ఇక పేద ప్రజల కడుపులు నింపి వారినుండి సానుభూతి కొట్టేస్తే పదవులకు ఢోకా ఉండదన్న విషయం తెలిసిందే...  

 

మరింత సమాచారం తెలుసుకోండి: