ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న వైరస్ కరోనా. ప్రస్తుతం చైనాలో ప్రాణాంతకమైన మాయదారి కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే చైనా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా..  ప్రస్తుతం చైనా ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతకమైన కరోనా రక్కసి  బారినపడి మృతి చెందినవారి సంఖ్య ఈరోజుతో 1000 దాటిపోయింది.  చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం ఒక వెయ్యి 11 మంది కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనధికారికంగా అయితే ఈరోజు రక్కసి  వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య భారీగా ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒక్క రోజులో హుబి  ప్రావిన్స్లో 103 మంది ఇది ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి మరణించారు.

 


 హుబ్లీ ప్రావిన్స్లో మరో 2097 మందికి ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు అని హెల్త్ కమిషన్ వెల్లడించింది. చైనా దేశ వ్యాప్తంగా 42వేల 200 మందికి పైగా ప్రజలు ఈ ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి... మృత్యువుతో పోరాటం చేస్తుండడంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఈ అంశం  కలవరపెడుతోంది. మరోవైపు కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. వైద్య సిబ్బందిని రోగులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరొనను  కట్టడానికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

 మరోవైపు అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ jఆరోగ్య సంస్థకు చెందిన బృందం నిన్న రాత్రి చైనాకు చేరుకుంది. ఈ బృందానికి బ్రూస్ ఐలీవర్డ్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన ఆఫ్రికాలో ఎబోలా వైరస్ సోకినప్పుడు కూడా ఈ బృందం కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఇకపోతే ప్రస్తుతం రోజురోజుకు విజృంభిస్తున్న ఈ ప్రాణాంతకమైన  వైరస్ తో ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ పలు దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. మరికొన్ని దేశాలు తమ దేశంలోకి కరోనా  వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: