మనిషి సర్వతోముఖాభివృద్ధికి ఆర్ధిక స్వేచ్చ చాల అవసరం. మనిషి సుఖంగా జీవించడానికి మత స్వేచ్చ రాజకీయ స్వేచ్చ బావ ప్రకటన స్వేచ్చ ఎంత అవసరమో ఆర్ధిక స్వేచ్చ కూడ అంతకు మించి అవసరం. అయితే ఆర్ధిక స్వేచ్చే ఒకరు ఇచ్చేది కాదు ఎవరికి వారు కష్టపడి దానిని సంపాదించుకోవాలి.


మనం చేసే పని ద్వారా ఆదాయం వచ్చినా రాకపోయినా భవిష్యత్ లో పనిచేయలేని పరిస్థితులు మనకు ఏర్పడినా డబ్బుతో ముడిపడిన అవసరాలు అన్నింటిని తీర్చుకోగల శక్తిని కలిగించుకునేడట్లు చెసుకోవడమే ఆర్ధిక స్వేచ్చ లక్షణం. సాధారణంగా పుట్టుకతో ఏ వ్యక్తికి ఆర్ధిక స్వేచ్చ ఉండదు. కేవలం సంపన్నుల కుటుంబంలో పుట్టిన వారికి మాత్రమే వారు ప్రయత్నించకుండానే వారికి ఆర్ధిక స్వేచ్చ ఏర్పడుతుంది.


ఒక వ్యక్తి తన దైనందిన ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ లో తన ఆర్ధిక స్వేచ్చ కోసం ఇతరులు పై ఆధారపడకుండా ఎంతోకొంత సంపదను కూడపెట్టుకోవడమే ఆర్ధిక స్వేచ్చ అని అంటారు. బిల్ గేట్స్ ధీరుబాయి అంబానీ లాంటి అపర కుభేరులు మొదట్లో చాల డబ్బు విషయంలో గడ్డు కాలం అనుభవించిన వారే. అయితే వారి ముందు చూపు వారికి విజయంతో పాటు ఆర్ధిక స్వేచ్చను కూడ కలిగించడంతో కేవలం తమ స్థిరాస్థుల ద్వారానే అనేక ఆదాయాలు పొందుతున్నారు అన్నది వాస్తవం.


అయితే అధిక ఆదాయాన్ని ఆర్జించిన వారికి ఖచ్చితంగా ఆర్ధిక స్వేచ్చ ఉంటుంది అనుకుంటే అది పొరపాటు అని అనేకమంది మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. ఒక వ్యక్తికి ప్రతినెల 10 లక్షలు సంపాదించినా అతడికి ఆర్ధిక స్వేచ్చ ఉంటుంది అని బావిస్తే పొరపాటు. దీనికి కారణం ఆ వ్యక్తి కుటుంబ ఖర్చులు 12 లక్షలు దాటి ఉండటం. దీనితో ఎక్కువ సంపాదన సంపాదించిన ప్రతి వ్యక్తి ఆర్ధిక స్వేచ్చ ఉన్నవాడు కాడు. అయితే కేవలం నెలకు 25 వేలు సంపాదించే మరొక వ్యక్తికి ఆర్ధిక స్వేచ్చ ఉంటుంది. దీనికి కారణం ఆ వ్యక్తి తనకు వచ్చే అతి తక్కువ జీతంలోనే పొదుపు చేయడం. దీనితో వీలైనంత తక్కువ డబ్బుతో జీవించడం అలవాటు చేసుకున్న వారు తొందరగా ఆర్ధిక స్వేచ్చను పొంది ఆ తరువాత ఐశ్వర్య వంతులుగా మారుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: