ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకోబోతోంది. బీజేపీ కేజ్రీని గ‌ద్దె దించేందుకు జాతీయ అంశాల‌ను ఫోక‌స్ చేసి చేతులు ఎత్తేసింది. ఇక్కడ బిజెపి జాతీయ అంశాలను ఆధారంగా చేసుకొని ఎన్నికలకు వెళితే... కేజ్రీవాల్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా స్థానిక అంశాలను మాత్రమే ప్రధాన అజెండాగా పెట్టుకుని ప్రచారం చేశారు. ఇక కొద్దిరోజులుగా రాష్ట్రాల్లో బిజెపికి తగులుతున్న వరుస ఎదురు దెబ్బల ప‌రంప‌ర‌లో ఇప్పుడు ఢిల్లీలో కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. కొద్దిరోజుల క్రితం జరిగిన మహారాష్ట్ర, హ‌రియానా, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఇప్పుడు ఢిల్లీ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

 

ఈ ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ గెలుపు వెన‌క ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు, ఆయ‌న క‌ష్టంతో పాటు ఢిల్లీ ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు ఉన్న న‌మ్మ‌కం, క్రేజ్‌తో పాటు అమిత్ షా వ్యూహాలు, ప్ర‌చారం కూడా కేజ్రీవాల్‌ను గెలిపించింద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల‌కు ముందే ఢిల్లీలో బీజేపీ గెల‌వ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన బీజేపీ నేత‌లు కేజ్రీవాల్ ను టార్గెట్‌గా చేసుకుని ఇష్టారాజ్యంగా విమ‌ర్శ‌లు చేశారు. అయిత్ షా అయితే కేజ్రీవాల్‌ను టార్గెట్‌గా చేసుకుని చేసిన విమ‌ర్శ‌ల‌కు లెక్కే లేదు. 

 

ఇంటింట ప్ర‌చారంలో సైతం అమిత్ షా కేజ్రీవాల్ గురించి నెగిటివ్‌గా ప్ర‌చారం చేయాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. కేజ్రీవాల్ ప‌వ‌ర్ లేని సీఎం అని.. ఆయ‌న కేవ‌లం ఓ న‌గ‌ర మేయ‌ర్‌గా ఉండ‌డం మిన‌హా ఆయ‌న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను కూడా బ‌దిలీ చేయ‌లేర‌ని విమ‌ర్శించారు. ఇవ‌న్నీ ఢిల్లీలో ఉన్న సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఆలోచ‌న‌కు కార‌ణ‌మ‌య్యాయి. దీంతో అవ‌న్నీ బీజేపీ పుట్టి ముంచాయి. ఢిల్లీ ఓట‌రు మ‌రోసారి ఏక‌ప‌క్ష తీర్పు ఇచ్చేశారు. మ‌రి ఇప్ప‌ట‌కీ అయిన బీజేపీ త‌న అణ‌గ‌దొక్కే, అణిచివేత రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి అభివృద్ధి రాజ‌కీయాల‌ను కోరుకుంటుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: